Podu Lands: తెలంగాణలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా

పలు కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది.

Podu Lands: తెలంగాణలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా

Telangana Podu Lands

Updated On : June 24, 2023 / 3:52 PM IST

Podu Lands – Telangana: తెలంగాణలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. తెలంగాణలోని కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా (Kumuram Bheem Asifabad) నుంచి పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నేటి నుంచే ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ముందుగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

పలు కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. దీంతో కలెక్టర్లు తీరికలేకుండా గడుపుతున్నారు.

ఓటర్ల జాబితా, ఎన్నికల పోలింగ్ కేంద్రాల వంటి అంశాలపై సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ నెల 29 న బక్రీద్ పండుగ ఉంది. దీంతో జూన్ 30న ముహూర్తం ఖరారు చేసింది ప్రభుత్వం. అదే రోజు అసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.

Sarpanch Navya : ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య ఆరోపణలు,సుమోటాగా తీసుకున్న మహిళా కమిషన్, ఆధారాలు ఇవ్వాలని పోలీసుల నోటీసులు