Jagadish Reddy : 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో పవర్ హాలిడేలు, కరెంట్ కోతలు : మంత్రి జగదీష్ రెడ్డి

మోదీ ప్రధాని అయ్యాక కూడా ఆయన చెప్పిన వారే ముఖ్యమంత్రి అయిన ఎందుకు కరెంట్ కోతలు ఉన్నాయని ప్రశ్నించారు. గుజరాత్ లోని అనేక నగరాల్లో ఇప్పటికీ కరెంట్ కోతలు ఉన్నాయని తెలిపారు.

Jagadish Reddy : 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో పవర్ హాలిడేలు, కరెంట్ కోతలు : మంత్రి జగదీష్ రెడ్డి

Minister Jagadish Reddy

Jagadish Reddy – PM Modi : ప్రధాని మోదీ, బీజేపీపై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గడిచిన 20 సంవత్సరాల నుండి గుజరాత్ లో ఉన్నది ప్రధాన మంత్రి పార్టీనేనని వాళ్లే అధికారంలో ఉన్నారు కానీ ఇప్పటికీ గుజరాత్ లో పవర్ హాలిడే లు ఉన్నాయిని తెలిపారు. మోదీ ప్రధాని అయ్యాక కూడా ఆయన చెప్పిన వారే ముఖ్యమంత్రి అయిన ఎందుకు కరెంట్ కోతలు ఉన్నాయని ప్రశ్నించారు. గుజరాత్ లోని అనేక నగరాల్లో ఇప్పటికీ కరెంట్ కోతలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ ఎర్ర గడ్డలోని ట్రాన్స్ కో ఆడిటోరియంలో టీఎస్ ఎస్పీడిసిఎల్ సంస్థలో జూనియర్ లైన్ మెన్ నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్య అతిథిలుగా మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి హాజరయ్యారు. మొత్తం 1362 మంది జే ఎల్ ఎం ఉన్నారు. అందులో 6 మహిళల జే ఎల్ ఎం లు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంట్ పోవడం లేదన్నారు. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉందని తెలిపారు. మన పర్ క్యాపిట విద్యుత్ వినియోగం 2162 మెగా యూనిట్స్ కానీ, దేశ సగటు 1250 యూనిట్స్ మాత్రమేని పేర్కొన్నారు.

Nara Lokesh : కొంత మంది మీడియా మిత్రులతో రోజు చిట్ చాట్ చేస్తున్నా ఎక్కడికి పారిపోలేదు : లోకేష్

దీనితోనే అర్థం అవుతుంది తెలంగాణ రావడం వలన ఏం జరిగింది, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఎలా ఉంది అని అన్నారు. ఇంత అప్పు చేశారని కొంత మంది వాగుతున్నారని అప్పు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ట్రాన్స్ మిషన్ ,డిస్టిబ్యూషన్ పెట్టిన ఖర్చు దాదాపు రూ.40 వేల కోట్లు అని చెప్పారు. మనమే స్వంతంగా విద్యుత్ జనరేషన్ చేయాలని ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు చేశారని పేర్కొన్నారు. బీహెచ్ఇఎల్ నష్టాల్లో ఉందని గుర్తించి మన జెన్కో సంస్థలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పజెప్పారని తెలిపారు.

బీహెచ్ఇఎల్ కు జెన్కో పనులు టెండర్ లు ఇవ్వడాన్ని కేంద్ర మంత్రులు వ్యతిరేకించారు.. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ వారికే ఇచ్చి ఇవాళ ఆ సంస్థను ఆదుకున్నారని వెల్లడించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలే 35729 మంది జెల్ ఎంలను నియమించుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో వలసలు పోయాయిని తెలిపారు. రాష్ట్రానికి వలసలు వస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధికి విద్యుత్ సరఫరా ఎంతో ముఖ్యం అన్నారు. విద్యుత్ ఇంజనీర్స్, లైన్ మెన్ ల కృషితో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

Muthireddy Yadagiri Reddy: నా బిడ్డ వల్లనే నా సీటు పోతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు: ముత్తిరెడ్డి కామెంట్స్

ట్రాన్స్ కో, జెన్కో ఉద్యోగం అంటే చాలా అదృష్టం : సీఎండీ ప్రభాకర్ రావు
ట్రాన్స్ కో, జెన్కో ఉద్యోగం అంటే చాలా అదృష్టమని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. మీరు ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించారని తెలిపారు. గతంలో విద్యుత్ సంస్థలో ఇద్దరే తెలిసేది ఒక్కటి చైర్మన్, మరొకటి లైన్ మెన్ లు అని పేర్కొన్నారు. మీరు కష్టపడి పని చేసి సంస్థకు మంచి పేరు తేవాలని కోరారు. తమకు వినియోగదారులు చాలా ముఖ్యం అన్నారు. వారికి ఎప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. భద్రత ప్రమాణాలను పాటించాలన్నారు.