Pranay Case: నాకు ఆడపిల్లలు ఉన్నారు.. నేను ఏ తప్పూ చేయలేదు.. తీర్పు తర్వాత జడ్జికి దోషులు ఇంకా ఏం చెప్పారు?

తీర్పు ప్రకటించిన తర్వాత ఏమైనా చెప్పుకుంటారా అని దోషులను న్యాయమూర్తి అడిగారు.

Pranay Case: నాకు ఆడపిల్లలు ఉన్నారు.. నేను ఏ తప్పూ చేయలేదు.. తీర్పు తర్వాత జడ్జికి దోషులు ఇంకా ఏం చెప్పారు?

Updated On : March 10, 2025 / 5:39 PM IST

తెలంగాణలో 2018 సెప్టెంబర్‌లో సంచలనం రేపిన ప్రణయ్‌ హత్య కేసులో ఇవాళ తీర్పు వచ్చిన విషయం తెలిసిందే. ప్రణయ్ హత్య కేసులో ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగిలిన దోషులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఏ1 అమృతరావు గతంలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.

తీర్పు ప్రకటించిన తర్వాత ఏమైనా చెప్పుకుంటారా అని దోషులకు న్యాయమూర్తి అడిగారు. ఏ3 అజ్గర్ అలీ, ఏ4 అబ్దుల్ భారీ, ఏ5 ఎంఏ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్ కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 నజీమ్‌ ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు.

Also Read: iPhone 17 series: ఐఫోన్ 17 సిరీస్‌ డమ్మీ ఫోన్లు చూశారా? వామ్మో.. డిజైన్‌లో ఎన్నెన్ని మార్పులో..

ఏయే దోషి ఏమన్నాడు?

A2 : శిక్ష గురించి నేనూ చెప్పుకునేది ఏమిలేదు. నా పాత్ర లేదు. మా నాన్న చనిపోయారు. మేము బ్రాహ్మణులం. కర్మకాండలు నిర్వహించాలి. మా అమ్మను చూసుకోవాలి.

A3: శిక్ష తగ్గించి వేయండి. నేను ఏ తప్పూ చేయలేదు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక పాపకు ఆరోగ్యం సరిగా లేదు.

A4: నేను హర్టు పేషెంట్‌ని. భార్య ఉంది. ఆమెకు ఇక తోడు ఎవ్వరు లేరు. ఆమెకు తోడుగా నేను ఉండాలి.

A5: నాకు గుండె సమస్య ఉంది. నా భార్యకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు. చదువుతున్న చిన్న పిల్లలు ఉన్నారు.

A6: నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. నా కొడుకు నీరుద్యోగి. ఈ కేసులో నా ప్రమేయం లేదు. దేశము అంతా తెలుసు.

A7 : నాకు చిన్న పిల్లలు ఉన్నారు.

రంగనాథ్‌కు అమృత కృతజ్ఞతలు
ప్రణయ్ హత్య జరిగిన సమయంలో నల్గొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్‌కు అమృత ఫోన్ చేసింది. ప్రణయ్‌ను చంపిన వ్యక్తికి ఉరి శిక్ష, మిగతావారికి జీవిత ఖైదు పడేలా కేసు నిలబెట్టినందుకు రంగనాథ్‌కు అమృత కృతజ్ఞతలు తెలిపింది. కేసులో తమకు మొదటి నుంచి సహకరించిన అమృతకు కూడా రంగనాథ్‌ కృతజ్ఞతలు చెప్పారు. “నీకు హామీ ఇచ్చినట్టుగానే ఇప్పుడు తీర్పు వచ్చింది” అని అమృతతో రంగనాథ్ అన్నారు.