Droupadi Murmu: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం కేసీఆర్
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలిసారి తెలంగాణ రావడంతో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనికులు గౌరవ వందనం సమర్పించారు.

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలిసారి తెలంగాణ రావడంతో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఆమెకు ఘన స్వాగతం పలికారు. సోమవారం సాయంత్రం ద్రౌపది ముర్ము హకీంపేట ఎయిర్‌పోర్టు చేరుకున్నారు.
Telangana: కీలక మలుపు తిరిగిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. విచారణ సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశం
అక్కడ సీఎం, గవర్నర్‌తోపాటు తెలంగాణ సీఎస్, ఉన్నతాధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఐదు రోజులపాటు రాష్ట్రపతి నగరంలోనే బస చేస్తారు. ఈ నెల 30 వరకు సికింద్రాబాద్, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోనే ఉంటారు. ఈ రోజు సాయంత్రం రాజ్ భవన్‌లో గవర్నర్ ఇచ్చే విందులో రాష్ట్రపతి పాల్గొంటారు. అయితే, ఈ విందుకు సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం లేనట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రపతి బస చేసే నిలయం వద్ద భద్రతా దళాల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాలను భద్రతా దళాలు పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసకున్నాయి. ఈ పర్యటనలో రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కాగా, కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రపతి హైదరాబాద్‌లో పర్యటించలేదు. చివరిసారిగా 2019లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇక్కడ పర్యటించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌తోపాటు, సిమ్లా, హైదరాబాద్ నగరాల్లో రాష్ట్రపతి అధికారిక నివాసాలు ఉన్నాయి. ప్రతి ఏడాది శీతాకాలంలో, డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రపతి ఇక్కడ పర్యటించడం ఆనవాయితీ. దేశ మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రపతులంతా ఇక్కడ బస చేసిన వాళ్లే.