ఈ ప్రాంతంతో నాకు ఎంతో అనుబంధం ఉంది: ప్రియాంక గాంధీ
Lok Sabha elections 2024: రైతులు, నిరుపేదలు, మహిళల కోసం బీజేపీ సర్కారు ఏమీ చేయదని అన్నారు.

దేశంలో రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించాలని ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణలోని తాండూర్ జనజాతర సభలో ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలో పేదలను ఆదుకునే పథకాలేమీ ఉండవని చెప్పారు. యూపీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1200గా ఉందని తెలిపారు. తెలంగాణ రూ.1200 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.500కే ఇస్తున్నారని తెలిపారు.
రైతులు, నిరుపేదలు, మహిళల కోసం బీజేపీ సర్కారు ఏమీ చేయదని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా అడిగితే వచ్చిందా? అని అన్నారు. బీజేపీ సర్కారు పాలనలో పేదలపై వేసే పన్నులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని తెలిపారు.
పేద రైతులు రూ.50 వేలు, రూ.లక్షల రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. చేసిన పనుల ఆధారంగా ఓట్లు అడిగే దమ్ము మోదీకి లేదని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి ఇవాళ 5 గంటలతో తెరపడుతుండడంతో చివరి నిమిషాల్లో ఆయా పార్టీల అగ్రనేతలు ప్రచారాల్లో మునిగి తేలారు.
Also Read: ఇదే అంశంపై నా ఎడిటెడ్ వీడియో ప్రసారం చేశారు: వనపర్తిలో అమిత్ షా