ఇదే అంశంపై నా ఎడిటెడ్ వీడియో ప్రసారం చేశారు: వనపర్తిలో అమిత్ షా

Amit Shah: రేవంత్ రెడ్డి ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా అవి నిజం కావని అన్నారు. తెలంగాణలోని..

ఇదే అంశంపై నా ఎడిటెడ్ వీడియో ప్రసారం చేశారు: వనపర్తిలో అమిత్ షా

Amit Shah

Updated On : May 11, 2024 / 4:04 PM IST

దళిత, ఆదివాసీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయలేదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. రాహుల్ గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చారని, తమకు రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు ఇస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పారు. ఈ నాలుగు శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని స్పష్టం చేశారు.

ఇదే అంశంపై తన ఎడిటెడ్ వీడియో ప్రసారం చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా అవి నిజం కావని అన్నారు. తెలంగాణలోని వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ విజయ సంకల్ప సభకు చేరుకున్న అమిత్ షా. నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థి పి.భరత్ తరుఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమిత్ షాతో మాట్లాడుతూ.. మోదీ మూడోసారి ప్రధాని అయ్యే ఎన్నికలు ఇవని అన్నారు. భరత్ ప్రసాద్ కు పడే ఒక్కో ఓటు నేరుగా మోదీకి చెందేదేనని తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేవలం అసత్యాలను నమ్ముకున్న పార్టీ అని అన్నారు. రిజర్వేషన్ల అంశంలో మోదీ దళితుల పక్షాన ఉంటారని తెలంగాణ ప్రజలకు తెలుసని తెలిపారు.

Also Read: దానిపై ఎలా పోరాడాలో నన్ను చూసి ప్రధాని మోదీ నేర్చుకోవాలి: కేజ్రీవాల్