అతి పెద్ద డ్రగ్స్ లింకును ఛేదించిన పోలీసులు.. కాంటాక్ట్ లిస్టులో హైదరాబాద్‌కి చెందిన 31 మంది వినియోగదారులు

Hyderabad: విద్యార్థి వీసాపై సయీద్ అలీ హైదరాబాద్ వచ్చాడని పోలీసులు గుర్తించారు.

అతి పెద్ద డ్రగ్స్ లింకును ఛేదించిన పోలీసులు.. కాంటాక్ట్ లిస్టులో హైదరాబాద్‌కి చెందిన 31 మంది వినియోగదారులు

అతి పెద్ద డ్రగ్స్ లింకును ఛేదించారు హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు. పాలస్తీనాకి చెందిన సయూద్ అలీ అనే వ్యక్తితో పాటుముంబైకి చెందిన రోమి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారి నుంచి మత్తు పదార్థాలు, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల కాంటాక్ట్ లిస్టులో 14 మంది స్మగ్లర్లతో పాటు హైదరాబాద్‌కి చెందిన 31 మంది మత్తు పదార్థాల వినియోగదారులు ఉన్నట్లు తేలింది. సయూద్ అలీ హైదరబాద్‌లోనే నివాసం ఉంటున్నాడు. అతడు ఇస్తున్న ఆర్డర్ల మేరకు గోవాలోని క్రిస్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడు రోమీ. సయీద్ అలీ విద్యార్థి వీసాపై హైదరాబాద్ వచ్చాడని పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌లో వరుసగా పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు బయటపడుతున్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. డ్రగ్స్ అమ్మకాలను పోలీసులు ఏ మాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Also Read : ఒత్తిడితో హైబీపీ, అజీర్ణం సమస్యలు.. మీ శారీరక ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిస్తుందంటే?