Python Died After Swallow Monkey : కోతిని మింగిన కొండ చిలువ మృతి

ఓ కోతిని మింగిన కొండ చిలువ మరణించింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. దండేపల్లి మండలంలోని కొండాపూర్ లో కదలకుండా ఉన్న కొండ చిలువ చుట్టూ కోతులు చేరి అరుస్తున్నాయి.

Python Died After Swallow Monkey : కోతిని మింగిన కొండ చిలువ మృతి

python died

Updated On : October 16, 2022 / 12:46 PM IST

Python Died After Swallow Monkey : కొన్ని సందర్భాల్లో కొండ చిలువలు.. కోళ్లు, మేకలు, పశువులు, మనుషులను మింగి చంపుతుంటాయి. కానీ ఓ కోతిని మింగిన కొండ చిలువ మరణించింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. దండేపల్లి మండలంలోని కొండాపూర్ లో కదలకుండా ఉన్న కొండ చిలువ చుట్టూ కోతులు చేరి అరుస్తున్నాయి.

Python : ఇంట్లోకి ప్రవేశించి రెండు కోళ్లను మింగిన కొండ చిలువ

ఇది గమనించిన గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూసే సరికి కొండ చిలువ మృతి చెంది ఉంది. దాని మధ్యలో ఉబ్బెత్తుగా కనిపించింది. అయితే కొండ చిలువ కోతిని మింగడం వల్ల మిగతా కోతులు దాడి చేసి ఉంటాయని, ఆ దాడిలో అది చనిపోయి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.