Raghunandan Rao: కేసీఆర్ చేసిన మోసాలు రాస్తే రామాయణమంత అవుతుంది.. చెబితేనేమో..: ఎమ్మెల్యే రఘునందన్
ఎమ్మెల్సీ కవిత కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారని రఘునందన్ రావు అన్నారు.

Raghunandan Rao
Mancherial: కొత్త పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మొట్టమొదటి బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మహిళల సాధికారత పట్ల అంత చిత్తశుద్ధి ఉన్న నేత ప్రధాని మోదీ అని చెప్పుకొచ్చారు. మంచిర్యాల జిల్లాలో రఘునందన్ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
సీఎం కేసీఆర్ చేసిన మోసాలు రాస్తే రామాయణమంత, చెబితేనేమో భాగవతం అంత అవుతుందని రఘునందన్ రావు అన్నారు. నరేంద్ర మోదీ అంటే విశ్వాసమని, కేసీఆర్ అంటే మోసమని వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చాక ఓపెన్ కాస్ట్ లు ఉండవని కేసీఆర్ అన్నారని, ఇప్పుడు అవే ఎక్కువ అయ్యాయని చెప్పారు.
ఎమ్మెల్సీ కవిత కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారని రఘునందన్ రావు అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కవిత ధర్నా చేశారని, ఇప్పుడు బీఆర్ఎస్ లో 33 శాతం మంది మహిళలకు టిక్కెట్లు కేటాయించాలని కేసీఆర్ ని ఆమె అడగాలని అన్నారు. బీజేపీ పేదల కోసం, దేశం కోసం పుట్టిందని చెప్పారు.
Harish Rao: రేవంత్ రెడ్డి.. ఒక్కసారి ఆ విషయాలను గుర్తుచేసుకో: హరీశ్ రావు