WPL 2026 : యూపీపై ఘన విజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన బెంగళూరు..
WPL 2026 : మహిళ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్లో మాజీ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది.
WPL 2026
- డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ
- యూపీపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం
- చెలరేగిన హ్యారిస్, స్మృతి మంధాన
WPL 2026 : మహిళ ప్రీమియర్ లీగ్ (WPL 2026) నాలుగో సీజన్లో మాజీ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం యూపీ వారియర్స్ తో జరిగిన తన చివరి గ్రూప్ మ్యాచ్ లో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది.
THE DELIGHTFUL STROKES OF GRACE HARRIS. pic.twitter.com/Z88KoCisH8
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2026
డబ్ల్యూపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ యూపీ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. దీప్తి శర్మ (55) అర్ధ సెంచరీ చేయగా.. కెప్టెన్ మెగ్ లానింగ్ (41)లతో రాణించారు. మిగిలిన బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలం అయ్యారు.
🚨 RCB QUALIFIED FOR THE 2ND FINAL IN THE WPL. 🚨
– Captain Smriti Mandhana and her army!!pic.twitter.com/XiXMohxPEQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2026
స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు.. 13.1 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 147 పరుగులు చేసింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై ఆర్సీబీ విజయం సాధించింది. గ్రేస్ హారిస్ (37 బంతుల్లో 75) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగింది. స్మృతి మంధాన (27 బంతుల్లో 54నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించింది. హారిస్, స్మృతి మంధాన జోడీ తొలి వికెట్ కు 55 బంతుల్లోనే 108 పరుగులు జత చేశారు. తాజా విజయంతో 12 పాయింట్లతో టాప్‌గా నిలిచిన స్మృతి మంధాన బృందం తుది పోరుకు అర్హత సాధించింది.
