Bandi Sanjay: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ రాహుల్ ట్వీట్.. బండి సంజయ్ కౌంటర్..

1400 మంది అమరవీరుల మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రధానిని ప్రశ్నిస్తోందని వ్యంగ్యాస్త్రాలు చేశారు.

Bandi Sanjay: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ రాహుల్ ట్వీట్.. బండి సంజయ్ కౌంటర్..

Bandi sanjay and Rahu Gandhi

Updated On : September 19, 2023 / 5:52 PM IST

MP Bandi Sanjay Kumar : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్‌లో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రస్తావించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో మూడు రాష్ట్రాల విభజన జరిగిందని, ఆ సమయంలో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారని మోదీ అన్నారు. కానీ, తెలంగాణ, ఏపీ విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రజలను సంతృప్తి పర్చలేకపోయిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందని, తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయని, కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేపోయిందని, మరోవైపు ఏపీ ప్రజలుసైతం తీవ్ర ఇబ్బంది పడ్డారని మోదీ అన్నారు.

Read Also: PM Modi: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపర్చడమేనని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ బండిసంజయ్ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. మీ స్క్రిప్ట్ రైటర్‌ను మార్చుకోండి పప్పుజీ అంటూ హితవు పలికారు. 1400 మంది అమరవీరుల మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రధానిని ప్రశ్నిస్తోందని వ్యంగ్యాస్త్రాలు చేశారు. ఒకే ఓటు – రెండు రాష్ట్రాలు అనే తొలిసారి పిలుపునిచ్చింది అటల్ బిహారీ వాజ్‌పేయి అని, మీ ముత్తాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ తెలంగాణను మోసం చేసిందని సంజయ్ ఘాటుగా విమర్శించారు.

Read Also:  Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం లాంఛనమే.. అయితే ఎప్పటి నుంచి అమలు చేస్తారో తెలుసా?

వందలాది మంది అమరవీరుల మరణానికి కారణమైనందుకు మీ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పాలో చూసుకోవాలని అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ – జెంటిల్‌మన్ ఒప్పందం పేరుతో తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేశారు. ఇందిరా గాంధీ హయాంలో 1969లో కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా దాదాపు 369 మంది ప్రాణాలు కోల్పోయారు. 1956లో ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన రోజు నుంచి తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని రాజీవ్ గాంధీ 1985లో హామీ ఇచ్చారు. 1400 మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత రాబోయేది భాజపా ప్రభుత్వం అని తెలిసి బిల్లును ప్రవేశపెట్టారు అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.