Weather Update: తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్.. రెండ్రోజులు ఆ జిల్లాల్లో వానలేవానలు.. హైదరాబాద్‌లో అయితే..

ఉరుములతో కూడిన వర్షంతోపాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Weather Update: తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్.. రెండ్రోజులు ఆ జిల్లాల్లో వానలేవానలు.. హైదరాబాద్‌లో అయితే..

Updated On : April 10, 2025 / 8:46 AM IST

Weather Update: ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, వర్షాలు పడినప్పటికీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: Donald Trump: హమ్మయ్య.. వెనక్కు తగ్గిన ట్రంప్.. దెబ్బకు పుంజుకున్న ఆసియా మార్కెట్లు

బంగాళాఖాతంలో అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం, ద్రోణి కొనసాగుతుండడంతోపాటు.. క్యూమిలోనింబస్ మేఘాల వల్ల తెలంగాణలో గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన వర్షంతోపాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది.

 

గురువారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.

 

హైదరాబాద్ లోనూ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో సాధారణంకంటే 2 నుంచి నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

Rains