Telangana Rains : తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి.

Telangana Rains : తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు

Telangana Rains

Updated On : April 29, 2021 / 7:19 AM IST

Telangana Rains : తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వానలు కురిశాయి.

రాగల 48 గంటలలో దక్షిణ, ఉత్తర, తూర్పు, మధ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి ఇంటీరియర్‌ కేరళ మీదుగా కోమరిన్‌ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి వానలు కురుస్తున్నాయి. వరుసగా మూడోరోజు కూడా కొన్నిచోట్ల వర్షాలు పడ్డాయి.