Governor Tamilisai : ప్రభుత్వం వివరణతో కూడిన సమాధానం ఇస్తేనే టీఎస్ఆర్టీసీ బిల్లుకు ఆమోదం : గవర్నర్ తమిళిసై

అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును ప్రవేశపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గవర్నర్ అనుమతి కోసం ఫైల్ ను రాజ్ భవన్ కు పంపారు. బిల్లును పంపి రెండు రోజులు అవుతున్నా గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేదు.

Governor Tamilisai : ప్రభుత్వం వివరణతో కూడిన సమాధానం ఇస్తేనే టీఎస్ఆర్టీసీ బిల్లుకు ఆమోదం : గవర్నర్ తమిళిసై

Governor Tamilisai (1)

Governor Tamilisai – TSRTC Merger Bill : ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లు పెండింగ్ పై రాజ్ భవన్(Raj Bhavan) క్లారిటీ ఇచ్చింది. ఈ బిల్లుపై కొన్ని సందేహాలను వ్యక్తం చేసిన గవర్నర్ వాటిని నివృత్తి చేయాలని సీఎస్ శాంతికుమారికి(CS Shanthi Kumari) లేఖ రాశారు. ఈ బిల్లును ఇప్పటికే అసెంబ్లీలో(Assembly) ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావించగా గవర్నర్ అనుమతి లభించకపోవడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వినిపించాయి. దీంతో రాజ్ భవన్ అర్ధరాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రభుత్వ నుంచి వివరణతో కూడిన సమాధానం వస్తే బిల్లుపై గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఆగస్టు3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆగస్టు2వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్ భవన్ కు బిల్లు చేరిందని, ఆ బిల్లును పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు మరి కొంత సమయం పడుతుందని తెలిపింది.

TSRTC Workers Bandh : ఆర్టీసీ కార్మికుల జంగ్ సైరన్.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు

దీనిపై న్యాయ సలహా తీసుకోవాల్సిన అవసరముందని రాజ్ భవన్ స్పష్టం చేసింది. కాగా, ఆర్టీసీ విలీనంకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును ప్రవేశపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గవర్నర్ అనుమతి కోసం ఫైల్ ను రాజ్ భవన్ కు పంపారు. బిల్లును పంపి రెండు రోజులు అవుతున్నా గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేదు.

అయితే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై బ్రేక్ వేసింది.  న్యాయపరమైన అభిప్రాయం తీసుకోవాలని గవర్నర్ పేర్కొన్నారు. కాగా, కావాలనే గవర్నర్ ఆర్టీసీ బిల్లును అడ్డుకున్నారని, అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం ఆరోపిస్తోంది. గవర్నర్ వైఖరి ఇటు ప్రభుత్వాన్ని అటు ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని మండిపడుతోంది.

KTR: ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ విలీనం… తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం

మరోవైపు గవర్నర్ వైఖరిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ భవన్ కు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై టీఎస్ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. శనివారం రెండు గంటలపాటు బస్సులు నిలిపివేసి నిరసన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

రెండు గంటలపాటు బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.  ఉదయం 8 గంటల వరకు బస్సుుల నిలిచిపోయాయి. గవర్నర్ వైఖరిని నిరరిస్తూ బస్ డిపోల ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. బస్సులు నిలిపివేసి ఆయా డిపోల ముందు ఆందోళన చేశారు. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.