Rajasingh: న్యూ ఇయర్ వేడుకలపై బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక
భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ ఆ వేడుకలు నిర్వహించొద్దంటూ హెచ్చరించారు. దేశంలోని యువకులు జాగ్రత్తగా ఉండాలని, జనవరి 1వతేదీన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవద్దని ఆయన సూచించారు.
BJP's suspended MLA Rajasingh's sensational comments on New Year celebrations
Rajasingh: మరో రెండ్రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరగనున్నాయి. ఎప్పటిలాగే న్యూ ఇయర్ వేడుకల్ని కొన్ని హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది మన సంస్కృతి కాదని, పాశ్చాత్య సంస్కృతి పండుగల్ని నిర్వహించుకోవాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించడం అప్పుడే ప్రారంభించారు. ఈ విషయమై భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ ఆ వేడుకలు నిర్వహించొద్దంటూ హెచ్చరించారు. దేశంలోని యువకులు జాగ్రత్తగా ఉండాలని, జనవరి 1వతేదీన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవద్దని ఆయన సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తమ స్వస్థలం సంస్కృతి గురించి తెలుసుకోవాలని, భారతీయులది కానిది ఏదైనా వేడుకలు జరుపుకోవద్దని కోరారు.
‘‘న్యూ ఇయర్ భారతీయ సంస్కృతి కాదు. అది పాశ్చాత్య సంస్కృతి. న్యూ ఇయర్ జరుపుకోవాల్సిన అవసరం లేదు. ఇది 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించిన ప్రజల సంస్కృతి. అలాంటి సంస్కృతి వారి న్యూ ఇయర్ చేసుకోవడం చెడు పద్దతి. యువకులు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి’’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.ముహమ్మద్ ప్రవక్తను ఉద్ధేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్యే టి రాజా సింగ్ను బీజేపీ సస్పెండ్ చేసింది. మహ్మద్ ప్రవక్తపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనను పోలీసులు గతంలో అరెస్టు చేశారు.
