హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్ రింగ్‌ రోడ్‌ వరకు వాహనాలు మెల్లిగా ముందుకు కదులుతున్నాయి. ఉప్పల్‌ నుంచి వరంగల్‌ నేషనల్ హైవే వెళ్లే వాహనాలు నత్తనడకన ముందుకు కదులుతున్నాయి.

హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

Updated On : August 9, 2025 / 5:43 PM IST

రాఖీ పండగ కావడంతో పాటు రేపు ఆదివారం సెలవు ఉండడంతో హైదరాబాద్‌ వాసులు భారీగా సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది.

హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. హయత్ నగర్‌ వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అలాగే, వనస్థలిపురం నుంచి భాగ్యలత, ఆర్టీసీ కాలనీ వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇటు ఉప్పల్‌ రింగ్‌ రోడ్‌ వద్ద కూడా ట్రాఫిక్‌గా ట్రాఫిక్ జామ్‌ ఉంది. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్ రింగ్‌ రోడ్‌ వరకు వాహనాలు మెల్లిగా ముందుకు కదులుతున్నాయి.

ఉప్పల్‌ నుంచి వరంగల్‌ నేషనల్ హైవే వెళ్లే వాహనాలు నత్తనడకన ముందుకు కదులుతున్నాయి. రాఖీ పండుగ వేళ హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్‌స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. వేలాది వాహనాలు హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో కనపడుతున్నాయి. రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికులు కిక్కిరిసిపోయారు.