రామగుండంలో విషాదం : గనిలోనే సింగరేణి కార్మికుడు సంజీవ్ మృతి
రామగుండంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్ది రోజులుగా మిస్సింగ్ అయిన సింగరేణి కార్మికుడు సంజీవ్ విగతజీవుడుగా కనిపించడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. క్షేమ

రామగుండంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్ది రోజులుగా మిస్సింగ్ అయిన సింగరేణి కార్మికుడు సంజీవ్ విగతజీవుడుగా కనిపించడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. క్షేమంగా ఇంటికి వస్తున్నాడని అనుకున్న వారి కోరిక నెరవేరలేదు. 11 రోజుల కిందట సంజీవ్ మిస్సింగ్ విషాదాంతంగా ముగియడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. సంజీవ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ పరామర్శించారు.
రామగుండం – 1 డివిజన్ పరిధిలో GDK – 11 గనిలో యాక్టింగ్ పంపు ఆపరేటర్ గా కోడెం సంజీవ్ (58) పని చేస్తున్నాడు. 2020, ఏప్రిల్ 07వ తేదీ మార్నింగ్ షిప్టుకు హాజరయ్యాడు. 4 సీమ్, 1 డిప్, 27 లెవల వద్ద విధులు కల్పించారు. మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగిశాయి. అదనపు ఛార్జీ కింద మరో పనిస్థలంలో సాయంత్రం 4 గంటల వరకు పనులు కేటాయించారుర. కానీ..పని వేళలు ముగిసినా..సంజీవ్ మాత్రం గని నుంచి పైకి రాలేదు.
ఇక అప్పటి నుంచి గాలించడం మొదలు పెట్టారు. సింగరేణి అధికారుల బృందం గని లోపల, ఉపరితలంపై, పరిసర ప్రాంతాల్లో గాలించారు. తన భర్తను క్షేమంగా బయటకు తీసుకరావాలని భార్య అధికారునలను వేడుకొంది. 2020, ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం DDMS అధికారి బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో నాలుగు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 6 – A గనికి చెందిప పాత గులాయిలో సంజీవ్ మృతదేహాన్ని గుర్తించారు. పాత గనికి సంబంధించిన దారిని అధికారులు మూసివేశారు. కానీ ఇక్కడకు సంజీవ్ ఎందుకు వెళ్లాడనేది తెలియరావడం లేదు. ఈ విషయంపై విచారణ జరుపుతున్నట్లు DDMS అధికారి వెల్లడించారు.
See Also | india coronavirus : కేసులు 13 వేల 835..452 మంది మృతి