Rangareddy Court : నాగరాజు హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు.. రంగారెడ్డి కోర్టు కీలక తీర్పు

ఆశ్రీన్ సుల్తానా, నాగరాజు ఐదేళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. మతాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంతో నడి రోడ్డుపై నాగరాజును సుల్తాన సోదరుడు హత్య చేశాడు.

Rangareddy Court : నాగరాజు హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు.. రంగారెడ్డి కోర్టు కీలక తీర్పు

Rangareddy court

Updated On : October 6, 2023 / 3:13 PM IST

Rangareddy Court Life Imprisonment : సరూర్ నగర్ లో నాగరాజు హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాగరాజు హత్య కేసులో రంగారెడ్డి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితులకు జీవిత జీవిత ఖైదు విధించింది. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతోపాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ఆశ్రీన్ సుల్తానా, నాగరాజు ఐదేళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. మతాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంతో నడి రోడ్డుపై నాగరాజును సుల్తాన సోదరుడు హత్య చేశాడు. మే4,2022లో సుల్తాన సోదరుడు పథకం ప్రకారం నాగరాజును హత్య చేశాడు.

Andhra Pradesh : తిరుపతి హోటల్‌లో జంట హత్యల కలకలం, భార్య బావమరిదిని హత్య చేసిన వ్యక్తి

ఈ కేసులో ఏ-1 మోబిన్ అహమ్మద్, ఏ-2 మసూద్ అహ్మద్ ఉన్నారు. పోలీసులు 120బి, 341, 302, రెడ్ విత్ 34, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతోపాటు జరిమానా విధించింది.