Child Raped : చాక్లెట్ ఇప్పిస్తానని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని నాలుగు సంవత్సరాల చిన్నారిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.

Child Raped : చాక్లెట్ ఇప్పిస్తానని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

Rape

Updated On : October 21, 2021 / 1:13 PM IST

Rape of a four-year-old child : నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయినా దుర్మార్గులు దారుణాలను ఒడిగడుతున్నారు. పసిపిల్లలు మొదలుకొని వృద్ధులను సైతం వదలడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక మూలన అమ్మాయిలపై లైంగిక వేధింపులు జరుగుతూనేవున్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని నాలుగు సంవత్సరాల చిన్నారిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని హిమాయత్ సాగర్ లో ఆలస్యంగా వెలుగుచూసింది.

TV Actress : విమానంలో నటితో వ్యాపారవేత్త అసభ్య ప్రవర్తన

కాంతు అనే యువకుడు చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి ఇంట్లోకి పిలిచి చి‌న్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా విషయం చెబితే చంపుతానంటూ బెదిరించాడు. చిన్నారికి రక్తస్రావం కావడంతో తల్లి గుర్తించారు.

స్థానికుల సహాయంతో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.