Bandi Sanjay : ఆ లక్ష కోట్లు కేసీఆర్ కుటుంబం నుంచి రికవరీ చేయాలి- బండి సంజయ్
కాంట్రాక్టులు, కమిషన్ మీద ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుపై కేసీఆర్ కి లేదు. పనుల నాణ్యతను కేసీఆర్ పట్టించుకోలేదు. Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar (Photo : Google)
Bandi Sanjay Kumar : తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. సీఎం కేసీఆర్ కి ప్రజల ఓట్లపై నమ్మకం లేదని, జన వశీకరణపై నమ్మకం ఉందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ వశీకరణ, తాంత్రిక పూజలు చేస్తారు అందుకే ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ కి వెళ్లడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ అందరి క్షేమం కోసం చేసే పూజలు మాత్రమే ఫలిస్తాయని వ్యాఖ్యానించారు.
”మేడిగడ్డ మర్చిపోక మునుపే అన్నారం బ్యారేజ్ లీక్ మొదలైంది. బ్యారేజ్ లీకేజీల గురించి కేసీఆర్ మాట్లాడాలి. కేసీఆర్ నదులకు నేర్పిన నడక ఎక్కడికి పోయింది? కాళేశ్వరంతో ఎవరికీ న్యాయం జరగలేదు. బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడటం లేదు. ప్రతి అసెంబ్లీ కేంద్రంలో ప్రొజెక్టర్ పెట్టి కాళేశ్వరం లీకేజీల గురించి కేసీఆర్ చెప్పాలి. కాంట్రాక్టులు, కమిషన్ మీద ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుపై కేసీఆర్ కి లేదు. పనుల నాణ్యతను కేసీఆర్ పట్టించుకోలేదు. తాంత్రిక పూజ సామగ్రి కాళేశ్వరంలో కలపడానికే కేసీఆర్ వెళ్ళారు. నాణ్యత లోపం కారణంగానే లీకేజీ సమస్యలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వ తప్పిదం.
Also Read : కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్ వెంకటస్వామి
కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలి. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డ్యామ్ లు కుంగుతున్నాయి, లీక్ అవుతున్నాయి. లక్ష 30 కోట్లు కేసీఆర్ కుటుంబం నుంచి రికవరీ చేయాలి. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం విద్రోహ చర్య అయితే పోలీసులు ఏం చేస్తున్నారు? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి విద్రోహ చర్య అంటే ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నారా?” అని బండి సంజయ్ ప్రశ్నించారు.
Also Read : రూ.70 గడియారం కావాలా..? ఆత్మగౌరవం కావాలా..? : సీఎం కేసీఆర్