పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం…

పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం…

Updated On : January 26, 2021 / 1:17 PM IST

Republic Day celebrations in Telangana : తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో జాతీయజెండాను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌవర వందనం స్వీకరించారు. మంగళవారం (జనవరి 26, 2021) గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ప్రకటించారు.

కరోనాను రాష్ట్ర ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంటోందన్నారు. భారత్ బయోటెక్ తొలి దేశీయ టీకాను రూపొందించిందని తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. కరోనా సమయంలో సొంత ఖర్చులతో వలస కూలీలను తరలించినట్లు తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కల్లో 91 శాతం సంరక్షించామని చెప్పారు.

తెలంగాణ భవన్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతీయ పతకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళలుర్పించారు. తెలంగాణ హైకోర్టులో జాతీయ జెండాను చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ ఆవిష్కరించారు. పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.