Telangana : తెలంగాణలో కార్పొరేషన్లలో మేయర్ స్థానాలకు.. మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
Telangana : తెలంగాణలో పది మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయించింది.
Telangana
Telangana : తెలంగాణలో పది మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. 10 స్థానాల్లో మహిళలకు ఐదు, బీసీలకు మూడు, ఎస్సీకి 1, ఎస్టీకి 1 చొప్పున ప్రభుత్వం రిజర్వేషన్ కేటాయించింది.
Also Read : Gold and Silver Rates Today : రాత్రికిరాత్రే బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఎందుకిలా? నేటి ధరలు ఇవే..
కార్పొరేషన్ల వారిగా మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఇలా..
కొత్తగూడెం కార్పొరేషన్ (ఎస్టీ జనరల్)
రామగుండం కార్పొరేషన్ (ఎస్సీ జనరల్)
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ (బీసీ మహిళ)
మంచిర్యాల కార్పొరేషన్ (బీసీ జనరల్)
కరీంనగర్ కార్పొరేషన్ (బీసీ జనరల్)
జీహెచ్‌ఎంసీ (మహిళా జనరల్)
గ్రేటర్ వరంగల్ (జనరల్)
ఖమ్మం కార్పొరేషన్ (మహిళా జనరల్)
నల్గొండ కార్పొరేషన్ (మహిళా జనరల్)
నిజామాబాద్ కార్పొరేషన్ (మహిళా జనరల్)

మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా 121 మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను ఐదు ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు.
ఎస్టీ, ఎస్సీ కేటగిరి..

బీసీ కేటగిరి ..

అన్ రిజర్వుడ్..

సింబల్స్ విడుదల..
మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరగబోయే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఫైనల్ ఓటర్ లిస్టులను ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు.. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించనున్న సింబల్స్ (గుర్తుల)ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 75 గుర్తులను కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నిలక కమిషనర్ రాణి కుముదిని శుక్రవారం గెజిట్ జారీ చేశారు. . ఇక రాష్ట్ర ఎన్నికల సంఘంలో రిజిష్టర్ అయ్యి, పార్టీ సింబల్స్ లేని 77 పొలిటికల్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం 75 గుర్తులను కేటాయించారు.
