Murder : కె.పి.హెచ్.బిలో దారుణం.. మిగిలిన బిర్యానీ కోసం వెళ్తే కొట్టి చంపారు..!

హైదరాబాద్ కె.పి.హెచ్.బిలో దారుణం జరిగింది. కస్టమర్‌ను దొంగంగా భావించిన రెస్టారెండ్ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందాడు.

Murder : కె.పి.హెచ్.బిలో దారుణం.. మిగిలిన బిర్యానీ కోసం వెళ్తే కొట్టి చంపారు..!

Murder

Updated On : December 17, 2021 / 11:04 AM IST

Murder : హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మిగిలిపోయిన బిర్యానీ కోసం ఓ కూలీ రెస్టారెంట్ కి వెళ్ళాడు. అతడిని దొంగగా భావించిన రెస్టారెంట్ సిబ్బంది దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. కూకట్‌పల్లిలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చదవండి : Girl Murder : ఏడేళ్ల బాలిక కిడ్నాప్..నోటిలో రాళ్లు వేసి హత్య..నిందితుడి ఆచూకీ చెబితే రూ.50 వేలు బహుమతి

ఒడిశాకు చెందిన రాజేష్‌ అనే కార్మికుడు భార్య, పిల్లలతో కలిసి మాదాపుర్‌లో ఉంటూ ప్రగతినగర్‌లో భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి సమయంలో పని ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో జేఎన్‌టీయూహెచ్‌ మెట్రో స్టేషన్‌ పక్కనే ఉన్న మొఘల్స్‌ ప్యారడైజ్‌ రెస్టారెంట్‌ దగ్గరకు వెళ్లాడు. రెస్టారెంట్ సెల్లార్లోకి వెళ్లి మిగిలిన బిర్యానీ ఏరుకుంటున్నాడు. అతడిని గమనించిన సిబ్బంది దొంగగా బావిచి దాడి చేశారు.

చదవండి : Attempt Murder : కూతుర్ని కాపురానికి తీసుకు వెళ్ళట్లేదని వియ్యపురాలిపై దాడి..మృతి

సిబ్బంది దాడిలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడే పడిపోయాడు.. కనికరం కూడా లేకుండా కిందపడిన వ్యక్తిని అక్కడే వదిలేసి వెళ్లారు సిబ్బంది. గురువారం ఉదయం వచ్చి చూసేసరికి అతడు అక్కడే పడి ఉన్నాడు. దీంతో రాజేష్ తండ్రికి సమాచారం ఇచ్చారు రెస్టారెంట్ సిబ్బంది. అతడు రాజేష్ భార్యకు విషయం తెలపడంతో ఆమె వచ్చి భర్తను ఇంటికి తీసుకెళ్లింది. అయితే కొద్దిసేపటికే అతడు మృతి చెందడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.