Endowment Lands: దేవాదాయ భూముల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఎండోమెంట్ అధికారులతో పాటు పోలీసులు, హైడ్రా అధికారుల సాయంతో ఆక్రమణల తొలగింపునకు కసరత్తు చేస్తామంది తెలంగాణ ప్రభుత్వం.

Endowment Lands: దేవాదాయ భూముల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Updated On : November 2, 2025 / 1:29 AM IST

Endowment Lands: దేవాదాయ భూములను రక్షించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కబ్జాకోరల్లో చిక్కుకున్న వేల కోట్ల విలువైన దేవాదాయ భూములు రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 చాప్టర్ 11 సవరణకు కసరత్తు మొదలు పెట్టింది. చట్టంలోని 83, 84 సెక్షన్లు తొలగించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దీనికి సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది.

ట్రిబ్యునల్, కోర్టు కేసులతో వేల ఎకరాలు కబ్జా జరిగినట్లు రేవంత్ సర్కార్ గుర్తించింది. ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వందల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని గుర్తించింది. వీటిని పరిరక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేవాలయ, ట్రస్ట్ సంస్థలకు చెందిన భూములు, భవనాలను ఎవరు ఆక్రమించినా వాటిని వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎండోమెంట్ అధికారులతో పాటు పోలీసులు, హైడ్రా అధికారుల సాయంతో ఆక్రమణల తొలగింపునకు కసరత్తు చేస్తామంది తెలంగాణ ప్రభుత్వం.