Cm Revanth Reddy: రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటాలో.. ఇకపై 85శాతం సీట్లు లోకల్స్ కే..

వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని ద్వారా రాష్ట్ర విద్యార్థులకు అదనంగా..

Cm Revanth Reddy: రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటాలో.. ఇకపై 85శాతం సీట్లు లోకల్స్ కే..

Updated On : November 1, 2025 / 11:56 PM IST

Cm Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో‌ 85 శాతం తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. తద్వారా మెడికోల దశాబ్దకాల ఆకాంక్ష తీరనుంది. తమ దశాబ్దకాల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (T-JUDA) కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటివరకు మేనేజ్‌మెంట్ కోటా సీట్లన్నీ ఆల్ ఇండియా కేటగిరీలో భర్తీ చేసేవారు. ఇకపై 85 శాతం సీట్లు తెలంగాణ బిడ్డలకే ఇవ్వనున్నారు.

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విజ్ఞప్తితో మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లు లోకల్ విద్యార్థులకు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నా సీఎం రేవంత్ రెడ్డి. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని ద్వారా రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318 మెడికల్ పీజీ, 70 డెంటల్ పీజీ సీట్లు దక్కనున్నాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో‌ స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుంది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా రాష్ట్ర సర్కార్ చర్యలు చేపట్టిందని చెప్పాలి.