Revanth Reddy: రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతల హౌజ్ అరెస్ట్… ధర్నాకు వెళ్లకుండా పోలీసుల చర్యలు

హైదరాబాద్, ఇందిరాపార్క్ వద్ద ఉన్న దర్నా చౌక్‌లో సర్పంచ్‌లు నిధుల కోసం సోమవారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్న నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధర్నాకు బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు.

Revanth Reddy: రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతల హౌజ్ అరెస్ట్… ధర్నాకు వెళ్లకుండా పోలీసుల చర్యలు

Updated On : January 2, 2023 / 1:23 PM IST

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితోపాటు పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, ఇందిరాపార్క్ వద్ద ఉన్న దర్నా చౌక్‌లో సర్పంచ్‌లు నిధుల కోసం సోమవారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది.

Telangana: పోలీస్ రిక్రూట్‌మెంట్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు పరీక్షలు

ఈ ధర్నాకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్న నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధర్నాకు బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు, రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం తలెత్తింది. పోలీసుల చర్యని రేవంత్ ఖండించారు. తనను ధర్నాకు వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదని పోలీసులతో వాదించారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసుకునే హక్కు అందరికీ ఉంటుందని, తనను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని రేవంత్ ప్రశ్నించారు. ధర్నాలు చేయకుండానే తెలంగాణ వచ్చిందా అని నిలదీశారు.

Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాకా మెట్రో రైల్ సర్వీసులు.. రెండు కారిడార్లలో ప్రారంభం

సర్పంచ్‌లకు చెందాల్సిన నిధులను ప్రభుత్వం వాడుకుందని, దీంతో సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆయన విమర్శించారు. రేవంత్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్ని కూడా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. పలువురు కాంగ్రెస్ నేతల ఇండ్లకు సోమవారం ఉదయమే చేరుకున్న పోలీసులు, నేతల్ని హౌజ్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి, మల్లు రవితోపాటు ఇతర నేతల్ని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. మరోవైపు తమ పార్టీ నేతల గృహ నిర్బంధంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసుల చర్యను నిరసిస్తూ పలు చోట్ల దిష్టిబొమ్మల్ని దహనం చేస్తున్నారు.