Revanth Reddy: తన కాన్వాయ్ వెళ్తున్న వేళ ట్రాఫిక్‌కి ఇబ్బంది కలగకుండా రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇప్పటికే రేవంత్ రెడ్డి తన అధికారిక కాన్వాయ్ కార్ల రంగు విషయంలోనూ పలు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో నిర్ణయం..

Revanth Reddy: తన కాన్వాయ్ వెళ్తున్న వేళ ట్రాఫిక్‌కి ఇబ్బంది కలగకుండా రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

cm revanth reddy

Updated On : December 15, 2023 / 7:50 PM IST

Telangana CM: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకోసం ట్రాఫిక్‌ని ఆపవద్దంటూ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

సాధారణ ట్రాఫిక్‌లోనే తన కాన్వాయ్‌ని అనుమతించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే రేవంత్ రెడ్డి తన అధికారిక కాన్వాయ్ కార్ల రంగు విషయంలోనూ పలు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కాన్వాయ్‌లోని తెల్లటి కార్లకు ఇక నలుపు రంగు వేయాలని చెప్పారు. ఇప్పుడు ఆయన తన బ్లాక్ ల్యాండ్ క్రూయిజర్ కారునే వాడుతున్నారు.

ముఖ్యమంత్రి కారుకు టీఎస్ 07ఎఫ్ఎఫ్0009 నంబర్ కేటాయించారు. మిగతా కార్లకు టీఎస్09ఆర్ఆర్0009 సిరీస్ నంబర్ ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని కార్ల రంగు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

TS High Court : ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు