TRS : వరి వార్.. నేడే టీఆర్ఎస్ నిరసనలు
ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు దిగుతుంది అధికార టీఆర్ఎస్. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేలాది మందిగా నిరసన తెలపనున్నారు.

Rice
Rice War Telangana : తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు అంశం ఇప్పుడు రాజకీయంగా హీటెక్కిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ 2021, నవంబర్ 11వ తేదీ గురువారం కలెక్టరేట్ల ఎదుట ధర్నాలుచేస్తే….2021, నవంబర్ 12వ తేదీ శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలపనుంది. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు దిగుతుంది అధికార టీఆర్ఎస్. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లు, క్యాడర్ మొత్తం కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలపనున్నారు.
Read More : Radheshyam : ‘రాధేశ్యామ్’ దర్శక నిర్మాతలకు ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ లేఖ.. నా చావుకి కారణం మీరే
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు జరుగనున్నాయి. ఎన్నికల కోడ్‌కు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో స్వయంగా ఎమ్మెల్యేలు ధర్నా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి రైతాంగంతోపాటు పార్టీ శ్రేణులు తరలివచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేలాది మందిగా నిరసన తెలపనున్నారు. ధాన్యం రైతు గోస ఢిల్లీకి వినిపించేలా, కేంద్రానికి సెగ తాకేలా ధర్నా నిర్వహిస్తామని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.
Read More : Musheerabad PS : రూ. 2 వేల కోసం ఫ్రెండ్‌ను చంపేశాడు
ఆయా జిల్లాల మంత్రులు వారి జిల్లాలో ఒకటి, రెండు చోట్ల ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీన్ని శాంతియుత నిరసన కార్యక్రమంగా గులాబీ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి మినహా కింది స్థాయి వరకు ఉన్న ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గాల వారీగా జరిగే ఈ ధర్నా కార్యక్రమంలో రైతులతో పాటు పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది. టీఆర్‌ఎస్ ధర్నాలకు కలెక్టర్లు, పోలీసు అధికారుల అనుమతి లభించింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో, మంత్రి హరీశ్‌వు సిద్దిపేటలో రైతులతో పాటు ధర్నాలో కూర్చుని నిరసన తెలుపనున్నారు. హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో రైతులకు సంఘీభావంగా గ్రేటర్ సిటీలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ధర్నా నిర్వహించనున్నారు. మంత్రి తలసాని నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరగనుంది.