Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి.. మరో ఐదుగురికి గాయాలు

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ చిన్నారి ఉన్నారు. గాయపడిన ఐదుగురిని..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి.. మరో ఐదుగురికి గాయాలు

Road Accident

Updated On : December 24, 2023 / 6:53 PM IST

Narayanpet District: నారాయణపేట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మక్తల్ మండలం జక్లేర్‌లో 167 జాతీయ రహదారి జక్లేర్ వద్ద ఎదురుగా వచ్చిన రెండు కార్లు పరస్పరం ఢీ కొన్నాయి.

ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారని పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ చిన్నారి ఉన్నారు. గాయపడిన ఐదుగురిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదానికి అతి వేగమే కారణమని సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Cardiac Arrest : ఈ గుండెకు ఏమైంది? స్పీచ్ ఇస్తుండగా స్టేజీపైనే గుండెపోటుతో ప్రొఫెసర్ మృతి