Cardiac Arrest : ఈ గుండెకు ఏమైంది? స్పీచ్ ఇస్తుండగా స్టేజీపైనే గుండెపోటుతో ప్రొఫెసర్ మృతి

విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. ఇంతలో స్టేజిపైనే ఒక్కసారిగా కుప్పకూలారు.

Cardiac Arrest : ఈ గుండెకు ఏమైంది? స్పీచ్ ఇస్తుండగా స్టేజీపైనే గుండెపోటుతో ప్రొఫెసర్ మృతి

IIT Kanpur Professor Dies With Cardiac Arrest (Photo : Google)

Updated On : December 24, 2023 / 6:52 PM IST

గుండెపోటు.. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సడెన్ గా అటాక్ చేస్తుంది. అంతే, ఆ మరుక్షణమే ప్రాణం పోతుంది. ఏ మనిషికి ఎప్పుడు మరణం వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్ మరణాల సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్.. ప్రాణం తీస్తున్నాయి. ఎప్పుడు వస్తుందో తెలీదు.. వచ్చిందంటే మాత్రం చావు ఖాయంగా మారుతోంది. ఉన్న చోటునే కుప్పకూలిపోతున్నారు. అప్పటివరకు మన మధ్యన ఉన్న వారు సడెన్ గా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు.

తాజాగా ఐఐటీ కాన్పూర్ సీనియర్ ప్రొఫెసర్ గుండెపోటుతో మరణించారు. మెకానికల్ ఇంజినీరింగ్ హెడ్ సమీర్ ఖండేకర్ గుండెపోటుతో చనిపోయారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. ఇంతలో స్టేజిపైనే ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. ఆ ప్రొఫెసర్ అప్పటికే చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. కాగా, సమీర్ ఖండేకర్ ఐదేళ్లుగా హై కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నట్లు తెలిసింది.

Also Read : టాయిలెట్‌కి సెల్ ఫోన్ తీసుకెళ్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

‘ప్రొఫెసర్ సమీర్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగ అధిపతి. డీన్ గా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులను ఉద్దేశించి లెక్చర్ ఇస్తున్నారు. ప్రొఫెసర్ సమీర్ ఔట్ స్టాండింగ్ టీచర్ గా, రీసెర్చర్ గా పేరు పొందారు. స్టేజిపైన నిలబడి విద్యార్థులకు లెక్చర్ ఇస్తున్న సమయంలో సడెన్ గా ఆయన ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి.

Also Read : మీ సెల్ ఫోన్ లో రేడియేషన్ ఎంత ఉందో ఇలా చెక్ చేసుకోండి

ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఆయన కుప్పకూలారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ప్రొఫెసర్ సమీర్ మరణించారని డాక్టర్ ధృవీకరించారు’ అని తోటి సిబ్బంది తెలిపారు. కళ్ల ముందే ప్రొఫెసర్ సమీర్ మరణించడం విద్యార్థులను, తోటి సిబ్బందిని షాక్ కి గురి చేసింది. సమీర్ ఇక లేరు అనే వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సమీర్ హఠాత్ మరణంతో తీవ్ర విషాదం అలుముకుంది.