Delhi Liquor Scam: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురు
కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ కోర్టు తోసిపుచ్చడం గమనార్హం.

kalvakuntla kavitha
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనను సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ తో పాటు, అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.
కాగా, వాదనల సమయంలో కవిత న్యాయవాది విక్రమ్ చౌదరి పలు వివరాలు తెలిపారు. తాము పూర్తిగా పోలీసు కేసు గురించి మాట్లాడుతున్నామని, కవిత అరెస్ట్ కి రిమాండ్ లేదా అరెస్టుకు రిమాండ్ రిపోర్టు ఆధారమైతే, అది పూర్తిగా అన్యాయం అని చెప్పారు.
కవితను అరెస్ట్ చేయడానికి ఎటువంటి కేసు లేదని, సెక్షన్ 41ను దుర్వినియోగం చేశారని అన్నారు. రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించిన వాంగ్మూలాలు చాలా పాతవని అన్నారు. వాటిని ఆధారంగా చేసుకుని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
కవితను నిన్న అరెస్ట్ చేశామని కోర్టుకు తెలిపింది సీబీఐ. ఆమెను 5 రోజుల కస్టడీకి కోరింది. మాగుంట రాఘవ సహా నిందితులు సీఆర్పీసీ 161, 164 ప్రకారం ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను అరెస్ట్ చేశామని స్పష్టం చేసింది. లిక్కర్ పాలసీ కేసులో కవిత కేజ్రీవాల్ తో కలిసి కుట్ర చేశారని తెలిపింది. సౌత్ గ్రూప్ కి అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారని తెలిపింది. కవితను ఈ కేసులో 2022 డిసెంబర్ 11న సీబీఐ ప్రశ్నించింది.
ఏప్రిల్ 14న దీక్షకు దిగనున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్