Falaknuma Express : ట్రైన్‌లో ఉగ్రవాదుల కలకలం.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఆకస్మిక తనిఖీలు
Falaknuma Express : ట్రైన్‌లో ఉగ్రవాదులు ఉన్నారంటూ ఫోన్ కాల్ రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తనిఖీలు చేపట్టారు.

Falaknuma Express
Falaknuma Express : ట్రైన్‌లో ఉగ్రవాదులు ఉన్నారంటూ ఫోన్ కాల్ రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రైలును నిలిపివేసి తనిఖీలు చేస్తున్నారు.
హౌరా నుంచి హైదరాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ వద్ద రైలును నిలిపివేసి స్థానిక పోలీసులు.. చర్లపల్లి ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
జనరల్, స్లీపర్, ఏసీ బోగీల్లో అణువణువు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా భావించిన వారి నుంచి గుర్తింపు కార్డులు, ఇతర వివరాలను సేకరిస్తున్నారు.
శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో ప్రత్యేక బృందాలు రైలులో తనిఖీలు చేపట్టాయి. అయితే, సుమారు అర్ధ గంటకుపైగా రైలులో తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ తనిఖీల్లో భాగంగా ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ, వస్తువులు కానీ లేకపోవడంతో ప్రయాణికులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
పూర్తిస్థాయి తనిఖీల అనంతరం ఫేక్ కాల్ అని పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. అనంతరం రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఆలస్యంగా చేరుకుంది.