Huge Electricity Bill : గ్రామ పంచాయతీ ఆఫీస్ కు రూ.11 కోట్ల 41 లక్షల 63 వేల 672 కరెంట్ బిల్లు

కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి గత జనవరి నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ.11 కోట్ల 41 లక్షలు 63 వేల 672 వచ్చింది. దీంతో ఆ బిల్లును చూసిన సర్పంచ్, పంచాయతీ సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

Huge Electricity Bill : గ్రామ పంచాయతీ ఆఫీస్ కు రూ.11 కోట్ల 41 లక్షల 63 వేల 672 కరెంట్ బిల్లు

electricity bill

Updated On : February 13, 2023 / 3:57 PM IST

Huge Electricity Bill : సాధారణంగా కరెంటు బిల్లు వేల రూపాయల్లో వస్తేనే మనం అమ్మో అనుకుంటాం.. అలాంటిది వేలు కాదు.. లక్షలు కాదు..ఏకంగా కోట్ల రూపాయల్లో వస్తే.. అవాక్కవ్వాల్సిందే. సరిగ్గా ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లిలో జరిగింది.

కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి గత జనవరి నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ.11 కోట్ల 41 లక్షలు 63 వేల 672 వచ్చింది. దీంతో ఆ బిల్లును చూసిన సర్పంచ్, పంచాయతీ సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇంత చిన్న కార్యాలయానికి కోట్ల రూపాయల్లో కరెంట్ బిల్లు ఏందంటూ ఆశ్చర్యపోయారు.

Electricity Bill : నెలకు కరెంట్ బిల్లు రూ.3419 కోట్లు-ఆస్పత్రిలో చేరిన ఇంటి యజమాని

దీనిపై విద్యుత్ అధికారులను ప్రశ్నించగా టెక్నికల్ సమస్య కారణంగా కోట్లల్లో బిల్లు వచ్చిందని చెప్పారు. టెక్నికల్ సమస్యను సరిదిద్ది గత నెల ఎంత బిల్లు వచ్చిందో మళ్లీ పంపిస్తామని చెప్పారు.