డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కోసం రూ. 600కోట్లు విడుదల

Double Bedroom:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేసింది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఈ నిధులు ఖర్చు చెయ్యనున్నారు.
ఈ పథకానికి మొత్తం రూ.600 కోట్లను విడుదల చేస్తూ గృహనిర్మాణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.3,750 కోట్లను ప్రభుత్వం కేటాయించగా.. అందులో భాగంగా అంతుకుముందు రూ.150 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం.
లేటెస్ట్‌గా మరో రూ.600కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పేదలకు గూడు కల్పిచేందుకు తెలంగాణా ప్రభుత్వం నిర్మాణం చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని త్వరితగతిన పూర్తి చెయ్యాలని ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది.