RS Praveen Kumar : పేదలు మరణిస్తే బొంద పెట్టేందుకు 6 ఫీట్ల జాగా లేదు.. కానీ, రూ. 170 కోట్లతో సీఎం కేసీఆర్ బంగ్లా నిర్మించుకున్నాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ కోసం త్యాగం చేసింది బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజనులేనని స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా యెర్రా కామేష్ ను ప్రకటించారు.

RS Praveen Kumar : పేదలు మరణిస్తే బొంద పెట్టేందుకు 6 ఫీట్ల జాగా లేదు.. కానీ, రూ. 170 కోట్లతో సీఎం కేసీఆర్ బంగ్లా నిర్మించుకున్నాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

BSP president RS Praveen Kumar

Updated On : October 11, 2023 / 4:20 PM IST

RS Praveen Kumar – CM KCR : సీఎం కేసీఆర్ పై బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బహుజనులు 2 వేల సంవత్సరాల నుండి ఆకలి దప్పికతో ఉన్నారని పేర్కొన్నారు. మరణిస్తే బొంద పెట్టేందుకు 6 ఫీట్ల జాగా దొరకని పరిస్థితి నెలకొని ఉందన్నారు. కానీ, రూ. 170 కోట్లతో సీఎం కేసీఆర్ బంగ్లా ఏర్పాటు చేసుకున్నాడని తెలిపారు. 300 ఎకరాల ఫాం హౌస్ పొలాలకు నీటి కోసం రాత్రికి రాత్రే ప్రభుత్వ డబ్బులు రూ.2వేల కోట్లతో కొండా పోచమ్మ సాగర్ చెరువు ఏర్పాటు చేసుకున్నాడని పేర్కొన్నారు.

బుధవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికొక ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కేసీఆర్, ఎమ్మెల్యే వనమా మోసం చేశారని తెలిపారు. 15వ తేదీన పులి బయటకు వస్తారని కేటీఆర్ చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఫించన్, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉండడానికి ఇల్లు లేని ప్రజలు ఎందరో ఉన్నారని పేర్కొన్నారు.

Rs Praveen Kumar : సీఎం కేసీఆర్ కొత్త మోసం- గృహలక్ష్మి పథకంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు, ఒక్కొక్కరికి 10లక్షలు ఇవ్వాలని డిమాండ్

కొత్తగూడెంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు అరాచకాల వల్ల ఒక కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓటుకు డబ్బులు ఇస్తామని వస్తారు వారిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. వనమా, పొంగులేటి ప్రజాసమస్యలు పట్టించుకోరని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అగ్ర వర్ణాలు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు.

వందకు 99 శాతం ఉన్న పేదల వద్ద ఎటువంటి సంపద లేదని.. నూటికి ఒక్క శాతం ఉన్న వీళ్ళ వద్ద 90 శాతం సంపద ఉందన్నారు. తెలంగాణ కోసం త్యాగం చేసింది బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజనులేనని స్పష్టం చేశారు. కొత్తగూడెం గడ్డమీద మొట్టమొదటి బహుజనుల ఎన్నికల నగారా మోగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా యెర్రా కామేష్ ను ప్రకటించారు.

RS Praveen Kumar : గృహలక్ష్మి పథకంతో ఎలాంటి లాభమూ లేదు, తెలంగాణలో వచ్చేది బీఎస్పీ ప్రభుత్వమే- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఎస్పీ బహుజనుల పార్టీ అని అన్నారు. మహిళలందరూ ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని అందరికీ చెప్పాలని సూచించారు. భూమి లేని నిరుపేదలకు ఎకరం భూమి రావాలంటే, 10 లక్షలు ఉద్యోగాలు రావాలంటే, బహుజన పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. లిక్కర్ షాపులు పోవాలంటే బహుజన రాజ్యం రావాలి అని అన్నారు.