RS Praveen Kumar: ప్రీతి ఘటనకు మతం, రాజకీయం రంగులు పులమాలని చూస్తే ఖబడ్దార్.. బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ హెచ్చరిక
ప్రీతి ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యంగా, బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో సరిపోదని, అందులో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

RS Praveen Kumar warns don't dare politicise and communalise preeti case
RS Praveen Kumar: వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నం చేసిన ప్రీతీకి మతం రంగు పులిమి రాజకీయ లబ్ది పొందాలని చూస్తే చూస్తూ ఊరుకోమని, ‘ఖబడ్దార్’ అంటూ తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. కొందరు ఈ ఘటనపై మతం రంగు, రాజకీయ రంగు పులమాని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యలు పేద వర్గాలను, ప్రీతి కుటుంబాన్ని అవమానించడమేనని అన్నారు. ఇటీవల మహేంద్ర యూనివర్సిటీలో ఒక విద్యార్థిపై దాడి చేసిన తన కొడుకుని వెనుకేసుకొచ్చిన బండి సంజయ్ నేడు ప్రీతి ర్యాగింగ్ ఘటనకు మతం రంగు పులిమి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Meghalaya Assembly Polls: పోలింగుకు సిద్ధమైన మేఘాలయ.. పోటీలో 369 మంది అభ్యర్థులు
పేద వర్గాలను అవమానానికి గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాగా, నిమ్స్ ఆసుపత్రికి ఆదివారం వెళ్లిన ప్రవీణ్ కుమార్.. చికిత్స పొందుతున్న ప్రీతిని పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యంగా ఉండాలని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రగతిభవన్‌లో కూడా పేదవర్గాలపై కనబడకుండా ర్యాగింగ్ జరుగుతదని విమర్శించారు. బహుజన వర్గాలకు చెందిన నాయకులు, అధికారులకు అక్కడికి అనుమతి ఇవ్వకుండా అవమానిస్తూ రాజకీయంగా ర్యాగింగ్ చేస్తున్నారని ఆరోపించారు.
Rajesh Mishra: ‘ఎమ్మెల్యే to లా’.. 12 తరగతి పరీక్ష హాలులోకి హాల్ టికెట్, ప్యాడ్‌తో బీజేపీ నేత
ప్రీతి ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యంగా, బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో సరిపోదని, అందులో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.