Meghalaya Assembly Polls: పోలింగుకు సిద్ధమైన మేఘాలయ.. పోటీలో 369 మంది అభ్యర్థులు
మొత్తం 3,419 పోలింగ్ స్టేషన్లలో 120 పోలింగ్ స్టేషన్లు పూర్తిగా మహిళల నిర్వహణలో ఉండగా, 60 మోడల్ పోలింగ్ స్టేషన్లు, మరో 60 పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక 119 పారామెడికల్ కంపెనీలను ఎన్నికల కమిషన్ మోహరించింది. మార్చి 2వ తేదీ వరకూ (ఎన్నికల ఫలితాలు వెలువడే తేది) మేఘాలయ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాలని ఎన్నికల సంఘం శనివారం ఆదేశించింది

All set for Meghalaya assembly poll says eci
Meghalaya Assembly Polls: హోరాహోరీ ప్రచారం ముగిసి ఇక పోలింగుకు సిద్ధమైంది మేఘాలయ. రాష్ట్ర అసెంబ్లీకి సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. పోలింగుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో 3,419 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేఘాలయలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఖాసి, జైన్‌టియా హిల్స్ రీజియన్‌లో 36 నియోజకవర్గాలు, గరో హిల్స్ రీజియన్‌లో 24 ని యోజకవర్గాలు ఉన్నాయి.
Nagaland Polls: నాగాలాండ్ బరిలో నలుగురే మహిళలు.. ఒక్కరు గెలిచినా చారిత్రక రికార్డే
రాష్ట్రంలో రిజిస్టరైన ఓటర్ల సంఖ్య 21,75,236. వీరిలో 10.99 లక్షల మంది మహిళలు ఉండగా 10.68 లక్షల మంది పురుషులు ఉన్నారు. ఇందులో 81,000 మంది తొలిసారి ఓటు వేస్తున్నారు. మొత్తం 369 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఇందులో 36 మంది మహిళలు ఉన్నారు. ఇక 44 మంది ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పోటీలోకి దిగుతున్నారు. సోమవారం ఉదయం7 గంటలకు కౌంటింగ్ మొదలై మధ్యాహ్నం 4 గంటలతో ముగియనుంది.
Rahul Gandhi on Savarkar: సావర్కర్ భావజాలంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
మొత్తం 3,419 పోలింగ్ స్టేషన్లలో 120 పోలింగ్ స్టేషన్లు పూర్తిగా మహిళల నిర్వహణలో ఉండగా, 60 మోడల్ పోలింగ్ స్టేషన్లు, మరో 60 పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక 119 పారామెడికల్ కంపెనీలను ఎన్నికల కమిషన్ మోహరించింది. మార్చి 2వ తేదీ వరకూ (ఎన్నికల ఫలితాలు వెలువడే తేది) మేఘాలయ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాలని ఎన్నికల సంఘం శనివారం ఆదేశించింది. మేఘాలయకు బంగ్లాదేశ్‌తో 443 కిలోమీటర్ల సరిహద్దు, అసోంతో 885 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. రాష్ట్రంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ముందస్తు చర్యలు తీసుకున్నామని, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి 144 సెక్షన్ అమల్లోకి తెచ్చామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఎఫ్ఆర్ ఖర్గోంగోర్ తెలిపారు.