RTC Bus : షాపులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

అంతటితో ఆగకుండా.. 33 కేవీ హైటెన్షన్‌ పోల్‌ను తాకి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు బస్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

RTC Bus : షాపులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Accident

Updated On : June 19, 2022 / 8:18 PM IST

RTC bus crash : హైదరాబాద్‌ బాచుపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రగతినగర్‌ కమాన్‌ వద్ద అదుపుతప్పి షాపులపైకి దూసుకెళ్లింది. ట్రాఫిక్‌సిగ్నల్‌ దాటుతున్న సమయంలో బస్సు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. పక్కనే ఉన్న హర్డ్‌వేర్‌ షాపు, కిరాణా షాపు, తోపుడు బళ్లను ఢీ కొట్టింది.

Vijayawada : ఫ్లైఓవర్ పై ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ

అంతటితో ఆగకుండా.. 33 కేవీ హైటెన్షన్‌ పోల్‌ను తాకి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు బస్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ తాగి ఉన్నాడా..? లేక బ్రేక్‌ ఫెయిల్‌ అయిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.