Rythu Bharosa: వీరి ఖాతాల్లోకే ‘రైతు భరోసా’ డబ్బులు.. అర్హత ఉండి నగదు రానివారు ఇలా చేయండి..

తెలంగాణ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో తొలి విడతలో భాగంగా ఎకరాకు 6వేలు చొప్పున జమచేయనుంది.

Rythu Bharosa: వీరి ఖాతాల్లోకే ‘రైతు భరోసా’ డబ్బులు.. అర్హత ఉండి నగదు రానివారు ఇలా చేయండి..

Rythu Bharosa Scheme

Updated On : January 26, 2025 / 2:47 PM IST

Rythu Bharosa: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. వీటిలో ‘రైతు భరోసా’ పథకం కూడా ఒకటి. ఈ పథకంలో అర్హత కలిగిన రైతన్నలు తమతమ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తున్నారు. అయితే, రేపటి (సోమవారం) నుంచి దశల వారీగా అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది. వ్యవసాయ శాఖ అందించిన తాజా గణాంకాల ప్రకారం.. వర్షాకాలంలో సాగు చేసిన భూముల వివరాలను తెప్పించుకున్న ప్రభుత్వం దాదాపు 1.49కోట్ల ఎకరాల్లో పంటలు సాగు అయినట్లు నివేదికల ఆధారంగా గుర్తించింది. ఈ పంటలు సాగు చేసిన రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నగదును ప్రభుత్వం జమ చేయనుంది.

Also Read: Indiramma Illu: ఇందిరమ్మ ఇంటికోసం అప్ల‌య్‌ చేశారా..? ఫైనల్ లిస్ట్ ఎప్పుడు.. ఎలా చెక్‌చేసుకోవాలంటే..

కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పొందడం, గతంలో బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుపడటం, ఖాతా నిర్వహణలో లేకపోవటం వంటి సమస్యలతో రైతులు గతంలో డబ్బులు రాక ఇబ్బంది పడ్డారు. అయితే, ఈసారి ఆ సమస్య లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. అలాంటి సమస్యలను సరిచేసుకొని సంబంధిత పత్రాలను క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ) వద్ద సమర్పించేందుకు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ వివరాలను పరిశీలించి అర్హులకు పెట్టుబడి సాయం అందించనున్నారు.

Also Read: Retirement age: ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్‌ పెంచడం ఖాయమా? నిరుద్యోగులకు మళ్లీ నిరాశ తప్పదా?

తెలంగాణ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.12వేల చొప్పున జమ చేస్తామని చెప్పింది. ఈ సీజన్ నుంచి ఎకరాకు రూ.6వేల చొప్పున ‘రైతు భరోసా’ నిధులు జమ చేయనుంది. ఇప్పటికే అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసింది. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో దశల వారీగా డబ్బులు జమ కానున్నాయి.

తొలిరోజు (సోమవారం) ఎకరం లోపు విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ అవుతుంది. ఆ తరువాత ఎకరంన్నర, రెండెకరాలు.. ఇలా విడతల వారీగా ‘ఈ-కుబేర్’ విధానం ద్వారా రైతు ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు. దశల వారీగా వారంరోజులపాటు ఈ నగదు జమ ప్రక్రియ కొనసాగుతుంది.

 

నగదు జమకాని వారు ఏం చేయాలి..
పంటలు సాగు చేస్తూ, రైతు భరోసా పథకానికి అర్హత కలిగి ఉన్నప్పటికీ రైతుల ఖాతాల్లో నగదు జమ కాకుంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి.
మీరు సాగు చేసిన పంట వివరాలు, భూ పట్టాదారు పాసు పుస్తకాలు, తదితర వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలి.
మీ పేరు అర్హుల జాబితాలో ఉన్నప్పటికీ.. మీ ఖాతాల్లో డబ్బులు రాకుంటే.. మీ బ్యాంక్ ఖాతా నిర్వహణలో ఏమైనా ఇబ్బంది ఉందా.. తదితర వివరాలను సరిచూసుకొని వ్యవసాయశాఖ అధికారుల సూచనలకు అనుగుణంగా తదుపరి ప్రక్రియను చేపట్టాలి.