Mahesh Babu: ఈడీ విచారణకు మహేశ్ బాబు హాజరవుతారా..? కొనసాగుతున్న సందిగ్ధత..

సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Mahesh Babu: ఈడీ విచారణకు మహేశ్ బాబు హాజరవుతారా..? కొనసాగుతున్న సందిగ్ధత..

Mahesh Babu

Updated On : May 12, 2025 / 10:58 AM IST

Mahesh Babu: హీరో మహేశ్ బాబు ఈడీ విచారణకు హాజరుపై సందిగ్దత నెలకొంది. సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఈడీ ముందుకు ఇవాళ మహేశ్ బాబు హాజరుకావాల్సి ఉంది. అయితే, మహేశ్ బాబు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. తన తరపున న్యాయవాదిని ఈడీ విచారణకు పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబుకు ఈడీ రెండు సార్లు నోటీసులు ఇచ్చింది.

Also Read: Jawan Murali Naik: జవాన్ మురళీ నాయక్ అంతిమయాత్రలో పాల్గొన్న పవన్ కల్యాణ్, నారా లోకేశ్.. ఫొటోలు వైరల్

సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తొలుత ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చింది. షూటింగ్ కారణంగా విచారణకు హాజరుకాలేనని, సమయం కావాలని మహేశ్ బాబు ఈడీకి విజ్ఞప్తి చేశారు. దీంతో మే 12న విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ ఈడీ ఎదుట మహేశ్ బాబు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆయన విదేశాల్లో షూటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తరపున న్యాయవాదిని ఈడీ విచారణకు మహేశ్ బాబు పంపించనున్నట్లు సమాచారం.

Also Read: Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్‌షాక్.. ఇప్పట్లో వారికి ఇళ్లు లేనట్టే..!

మహేశ్ బాబు సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ ను ప్రమోషన్ చేశారు. ఇందుకుగాను అతను మొత్తం 5.9కోట్లు తీసుకున్నట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 3.4కోట్లు నగదు, 2.5కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలపై పూర్తి వివరాలను సేకరించేందుకు విచారణకు రావాలని మహేశ్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.