Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్‌షాక్.. ఇప్పట్లో వారికి ఇళ్లు లేనట్టే..!
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా దరఖాస్తుదారులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజిస్తుంది.

Indiramma Housing Scheme
Indiramma Houses: తెలంగాణలోని అర్హత కలిగిన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ పథకం వర్తించేలా రేవంత్ సర్కార్ చర్యలు చేపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికతోపాటు, ఇళ్ల నిర్మాణలో వేగంపుంజుకుంది. ఇప్పటికే 100 ఇండ్లకు స్లాబ్ సైతం పూర్తయింది. మరోవైపు రెండో విడతలో లబ్ధిదారులను ఎంపికనుసైతం ప్రభుత్వం పూర్తి చేసింది. అయితే, గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పురోగతి లేదు.
Also Read: Telangana Govt: టెన్త్ పాస్ అయిన విద్యార్ధినిలకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
గ్రేటర్ హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా కేవలం దరఖాస్తుల సర్వే మాత్రమే పూర్తయింది. దీని ప్రకారం నగరంలో ఇళ్లు లేకుండా, కేవలం ఇంటి స్థలం కలిగిన వారు 18,055 మంది అర్హులున్నారు. ఇల్లు, ఇంటి స్థలం లేనివారు 8,16,832 మంది ఉండగా.. అందులో గత ప్రభుత్వంకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించాలని దరఖాస్తు పెట్టుకున్న పేదలే 80శాతం మంది ఉన్నారు. ఇంటింటి సర్వేకు వెళ్లినప్పుడు ఇంట్లో లేకపోవడం, ఇందిరమ్మ పథకం వద్దని విముఖత చూపిన వారి దరఖాస్తులను అధికారులు నిలిపివేశారు.
Also Read: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు షురూ.. అందాలతో అలరించిన సుందరీమణులు
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా దరఖాస్తుదారులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజిస్తుంది. ఎల్1 (ఇంటి స్థలం కలిగి, ఇల్లు లేనివారు), ఎ2 (ఇల్లు, ఇంటి స్థలం లేనివారు), ఎల్3 (పక్కా ఇల్లు కలిగిన వారు). పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉండి ఇల్లులేని వారికి తొలివిడతలో అధికారులు ప్రాధాన్యత నిస్తున్నారు. అయితే, మిగిలిన ఎనిమిది లక్షల మంది పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజధానిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వం ముందు రెండు మార్గాలున్నాయి. గత ప్రభుత్వం మాదిరిగా అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వడం. లేదంటే 60గజాల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించడం. భూమి ఇచ్చి, ఇల్లు కట్టించి ఇవ్వడం ప్రస్తతమున్న పరిస్థితుల్లో సాధ్యపడదనే అభిప్రాయం అధికారుల్లో ఉంది. అయితే, ప్రభుత్వం గ్రేటర్ పరిధిలోని పేదలకు సొంతింటి కలను ఏవిధంగా తీరుస్తుందన్న అంశంపై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయంకు వచ్చేసరికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని, దీంతో ఇప్పట్లో గ్రేటర్ లోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది.