Samantha Akkineni: కవితకు కారును బహుమతిగా ఇచ్చిన సమంత
తెలుగు చిత్ర సీమలో కొందరు నటీనటులు విరివిగా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వెంటనే తమకు తోచిన సాయం చేస్తుంటారు. ఆలా సాయం చేసే గుణం ఉన్న నటీమణుల్లో సమంత ఒకరు.

Samantha Akkineni
Samantha Akkineni: తెలుగు చిత్ర సీమలో కొందరు నటీనటులు విరివిగా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వెంటనే తమకు తోచిన సాయం చేస్తుంటారు. ఆలా సాయం చేసే గుణం ఉన్న నటీమణుల్లో సమంత ఒకరు. ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఎంతోమంది బాలబాలికలకు విద్య, వైద్య పరమైన సహకారాన్ని అందిస్తున్నారు.
పేదలను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే సమంత మరోమారు తన సేవాతత్పరతను చాటుకున్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న నారాయణఖేడ్ కు చెందిన కవిత రాథోడ్ అనే మహిళకు సమంత కారు బహుమతిగా ఇచ్చింది. ఆహా’ ఓటీటీలో సమంత నిర్వహిస్తున్న టాక్‌షో సామ్‌జామ్‌లో పాల్గొన్న కవిత రాథోడ్ తన కష్టాలను చెప్పుకొంది.
ఆమె కష్టాలు తెలుసుకున్న సమంత చలించిపోయింది. తనను ఆదుకుంటానని సమంత మాటిచ్చింది. చెప్పినట్లుగానే జీవనోపాధి కోసం క్యాబ్ కారును బహుమతిగా అందచేసింది. తనను ఆదుకున్న సమంతకు కవిత రాథోడ్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. సమంత సేవాగుణానికి సర్వత్రా ప్రశంశలు లభిస్తున్నాయి.