కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు : సమాధుల్ని కూల్చి ఇసుక తవ్వుతున్న అక్రమార్కులు

  • Published By: bheemraj ,Published On : November 19, 2020 / 12:02 PM IST
కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు : సమాధుల్ని కూల్చి ఇసుక తవ్వుతున్న అక్రమార్కులు

Updated On : November 19, 2020 / 12:21 PM IST

sand Illegal mining : కరీంనగర్ జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రామడుగు మండల పరిధిలోని వాగులో యదేశ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఇసుక కోసం సమాధులు కూల్చి వాగులో పూడ్చిపెట్టిన శవాలను సైతం బయటకు తీస్తున్నారు. మృతదేహాలు బయటకు రావడంతో రామడుగు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



జిల్లాలో యధేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. అర్ధరాత్రి వేళల్లో అక్రమార్కులు ఇసుకను యధేచ్ఛగా తవ్వేస్తున్నారు. వాగులో పూడ్చి పెట్టిన శవాలను సైతం పక్కకు తీసేసి తమకు కావాల్సిన ఇసుకను తీసుకెళ్తున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి.



అర్ధరాత్రి రామడుగు మండలంలోని వాగులోని ఇసుకను తవ్వనటువంటి ఇసుకాసురులు అక్కడున్నటువంటి డెడ్ బాడీలు బయటకు వచ్చిన సందర్భంలో వాటిని పక్కన పెట్టి తమకు అవసరమైన ఇసుకను తీసుకెళ్తుండటంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



https://10tv.in/tortured-on-girl-for-property-in-miryalaguda/
వాగు వెంట నిర్మించిన సమాధులను కూల్చి వేస్తూ ఇసుకను తవ్వి తీసుకెళ్తున్న ఘటనలపై రామడుగు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మశానాలకు కూడా రక్షణ లేదని వాపోతున్నారు. ఇసుక మాఫియా చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



ఇసుక అక్రమ తరలింపుపై నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ త్వకకాలపై రెవెన్యూ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.