Cheating Case : సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్టు
సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు బాధితులు ఒక్కొక్కరిగా బయటికొస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. చీటింగ్ కేసులో సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్టు అయ్యారు.

Sridar Rao
Sandhya Convention MD Sridhar Rao arrest : సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు బాధితులు ఒక్కొక్కరిగా బయటికొస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. చీటింగ్ కేసులో సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్టు అయ్యారు. బిల్డింగ్ నిర్మాణం పేరుతో రూ.15 కోట్లు మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం పోలీసు స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు.
బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ ఇప్పిస్తానని శ్రీధర్ రావు రూ.15 కోట్లు వసూలు చేసి.. ఇవ్వకుండా బాధితులను మోసం చేశారు. డబ్బులు చెల్లించినా ఫ్లోర్ ఇవ్వకుండా మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. 28 వేల స్క్వేర్ ఫీట్స్ కు రూ.15 కోట్లు బాధితులు చెల్లించారు.
Shivalinga Prasad : హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ అరెస్టు
దీంతో తమకు న్యాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్, పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు శ్రీధర్ రావును అరెస్టు చేశారు. రూ.15 కోట్ల చీటింగ్ కేసులో శ్రీధర్ రావును అరెస్టు చేశారు. ఇవాళ శ్రీధర్ రావును పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు.