Rahul Bharath Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర ఏర్పాట్లకు నాదగ్గర ‘పైసల్లేవ్’ .. అప్పు కూడా ఎవ్వరు ఇస్తాలే.. : జగ్గారెడ్డి
రాహుల్ జోడో యాత్ర ఏర్పాట్లు చేయటానికి నా దగ్గర డబ్బుల్లేవ్ .. కానీ అప్పు చేసేసైనా చేయాలె ..రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలకాలె అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

Rahul Bharath Jodo Yatra..Jaggareddy Interesting Comments
Rahul Bharath Jodo Yatra..Jaggareddy Interesting Comments : రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చేస్తున్న జోడో యాత్రం తెలంగాణలో కొనసాగుతోంది. ఈ యాత్ర గురువారం (నవంబర్3,2022) జగ్గారెడ్డి నియోజకవర్గం అయిన సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈసందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోడో యాత్రకు చేయాలని ఏర్పాట్లపై తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చేస్తున్న జోడో యాత్రను సక్సెస్ చేయటానికి యాత్ర నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు అంటూ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ అప్పు చేయాలని అప్పు చేసేసైనా జోడో యాత్రను సక్సెస్ చేయాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఎమ్మెల్యేని అయినా నాదగ్గర డబ్బుల్లేవు..పోనీ అప్పు చేసైనా భారత్ జోడో యాత్రకు ఏర్పాట్లు చేద్దామన్నా ఎవ్వరు తనకు అప్పు ఇవ్వటంలేదంటూ జగ్గారెడ్డి తనదైనశైలిలో వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీలాంటి చర్మీషా గల నేత జోడో యాత్ర చేపట్టారు.దాన్ని అందరం కలిసి సక్సెస్ చేయాలే..ఆయన జోడో యాత్ర ద్వారా నా నియోజక వర్గం అయిన సంగారెడ్డిలో పాదయాత్ర చేస్తుంటే..ఆ యాత్ర సంగారెడ్డికి తెలంగాణకే గర్వకారణం అని అన్నారు. సంగారెడ్డిలో జోడో యాత్రకు ఘనంగా ఏర్పాట్లు చేయాల్సిందేనని..డబ్బులు లేకపోతే అప్పు చేసైనా రాహుల్ గాంధీ జోడో యాత్రకు ఘనంగా ఏర్పాట్లు చేయాల్సిందేనని కార్యకర్తలను పిలుపు ఇచ్చారు.
మన దగ్గర డబ్బులు లేవు కదాని ఏర్పాట్లు చేయటం కుదరదు అనటం సరికాదు..మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ రారు..కాబట్టి డబ్బుల సమస్యలు పక్కన పెట్టి అప్పు చేసైనా రాహుల్ గాంధీని జోడో యాత్రకు ఏర్పాట్లు చేయాలని..ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలకాలని తన అనుచరులకు..కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు జగ్గారెడ్డి. తాను ఏర్పాటు చేయాలని కానీ వాటికి నాదగ్గర డబ్బుల్లేవు పోనీ అప్పు చేద్దామంటే కూడా ఎవ్వరు తనకు అప్పు ఇవ్వటంలేదు అంటూ వాపోయారు. అయినా సరే రాహుల్ గాంధీలాంటి నేత నా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే అప్పు చేసైనా ఏర్పాట్లు చేసి ఘనంగా స్వాగతం పలుకుతానని జగ్గారెడ్డి తెలిపారు.
సంగారెడ్డిలో మస్తుగా రియల్ ఎస్టేట్ జరుగుతోందని..మరో ఎమ్మెల్యే అయితే రియల్ ఎస్టేట్ వాళ్లను వేధించి అయినా డబ్బులు గుంజుతారని..కానీ నేను ఎప్పుడూ కూడా ఎవ్వరిని ఒక్క పైసా కూడా అవ్వలేదని తెలిపారు జగ్గారెడ్డి. తన స్థానంలో మరో ఎమ్మెల్యే ఎవ్వరు ఉన్నా డబ్బున్నవాళ్లను..వ్యాపారాలు చేసేవాళ్లను..రియల్ ఎస్టేట్ వాళ్లను డబ్బుల కోసం వేధించేవారని..కానీ తనకు అటువంటి అలవాట్లు లేవని..ఎవ్వరిని ఒక్క పైసా కూడా అడగలేదని అన్నారు జగ్గారెడ్డి.
కాగా..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హైదరాబాద్ లోని బహదూర్ గూడలో కొనసాగుతోంది. మంగళవారం (నవంబర్ 1,2022) ఉదయం రాహుల్ గాంధీ శంషాబాద్ నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. సాయంత్రానికి పురానాపూల్ నుంచి చార్మినార్.. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్‌కు పాదయాత్ర ఉంటుంది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక స్తంభాన్ని రాహుల్ సందర్శిస్తారు.