Railway Platform Ticket : సంకాంత్రి ఎఫెక్ట్.. రైలు ప్రయాణికులకు షాక్.. ప్లాట్‌ఫామ్ టికెట్ ధర పెంపు
సంక్రాంతి పండుగ వేళ.. ప్రయాణికులకు.. సౌత్ సెంట్రల్ రైల్వే షాక్ ఇచ్చింది. పండుగ వేళ కాచిగూడ రైల్వేస్టేషన్ లో అనవసర రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు

Railway Platform Ticket
Railway Platform Ticket : సంక్రాంతి పండుగ వేళ.. ప్రయాణికులకు.. సౌత్ సెంట్రల్ రైల్వే షాక్ ఇచ్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచింది. సంక్రాంతి పండుగ వేళ కాచిగూడ రైల్వేస్టేషన్ లో అనవసర రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్లాట్ ఫామ్ టికెట్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ధర పెంపు తాత్కాలికమే. సంక్రాంతి పండుగ ముగిసే వరకు ఈ పెంపు అమల్లో ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి.
Fresh Meat : తాజా మాంసాన్ని గుర్తించటం ఎలాగంటే?
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలు పెంచారు. ప్లాట్ ఫామ్ ఛార్జీలు పెంచడం ద్వారా నాన్ ట్రావెలర్స్ రద్దీని తగ్గించి, ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చేయాలన్నది అధికారుల భావన.
Tomatoes : టమాటాలు తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయా?
సాధారణంగానే సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు జనాలతో రద్దీగా ఉంటాయి. ఇక పండుగ సమయాల్లో ప్రత్యేకంగా చెప్పకర్కర్లేదు. జనంతో కిక్కిరిసిపోతాయి. ప్రయాణికులు పోటెత్తుతారు. ఇక వారి సంఖ్యకు సమానంగా వారిని సాగనంపే వారూ (బంధువులు, మిత్రులు) స్టేషన్ కు తరలివస్తారు. దీంతో రైల్వే స్టేషన్లపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. దానికి తోడు అధిక రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడతారు. ఈ ఒత్తిడిని తగ్గించడం, ప్రయాణికుల సౌలభ్యంతో పాటు ప్రత్యేక వడ్డింపు ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలనేది రైల్వే అధికారుల ఆలోచన. కాగా, గత మూడేళ్లుగా దసరా, సంక్రాంతి పండుగ సమయాల్లో ప్లాట్‌ఫాం టికెట్ రేట్లను పెంచుతున్నారు.