Tomatoes : టమాటాలు తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయా?…

అధిక బ‌రువు ఉన్న‌వారు, డ‌యాబెటిస్‌, హైబీపీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు కూడా ఆగ్జ‌లేట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌కు దూరంగా ఉండాల‌ని వైద్యులు చెబుతున్నారు.

Tomatoes : టమాటాలు తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయా?…

Tamoto

Tomatoes : మనం నిత్యం తినే ఆహారాల్లో టమాటా ఒకటి. ఈ కూరలోనైనా దీనిని చేర్చనిదే వంట పూర్తికాదు. కూర‌లు, స‌లాడ్లు, చారు, సూప్స్‌, వంటి వంట‌కాల్లో దీనిని వాడతారు. రుచికోసం దీనిని తప్పకుండా వినియోగిస్తారు. టమాటాలో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు పుష్క‌లంగా దొరుకుతాయి.. అయితే ట‌మాటాల‌ను తిన‌డం వ‌ల్ల కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డుతాయ‌ని చాలా మంది అంటుంటారు. అన‌డ‌మే కాదు.. కొంద‌రు వైద్యులు కూడా ఇదే మాట చెబుతుంటారు. ఇది ఏమేరకు వాస్తవమన్న విషయం చాలా మందికి తెలియక సతమతమౌతుంటారు. అయితే ఈ విషయం గురించి తెలుసుకోవాలన్న ఆతృత చాలా మందిలో ఉంటుంది.

సాధారణంగా మ‌నం తినే ఆహారాల్లో ఉండే మిన‌ర‌ల్స్‌, ఆగ్జ‌‌లేట్స్‌, కాల్షియంలు కిడ్నీల్లోని యూరిక్ యాసిడ్‌తో క‌లిసి రాళ్లుగా తయారవుతాయి. ఈ పక్రియ జరగటానికి చాలా సమయం పడుతుంది. ఇందుకు చిన్నసైజు రాళ్లు త‌యారై రాను రాను పెద్ద సైజులోకి మార్పుచెందుతాయి. రాళ్లు మూత్రాశ‌యానికి అడ్డుప‌డి మూత్రం రాకుండా చేస్తాయి. దీంతో విప‌రీత‌మైన, భరించ‌లేని నొప్పి క‌లుగుతుంది.

టమాటాలు అధికంగా తినేవారిలో ఇదే తరహాలో రాళ్లు ఏర్పడతాయని చాలా మంది అంటుంటారు. దీనికి కారణం టమాటాలో ఆగ్జలైట్స్ ఎక్కువగా ఉండటమే… కొంతమంది శరీర తత్వంలో ఆగ్జలైట్స్ ను అధికంగా శోషించుకునే స్వభావం ఉంటుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్సడతాయి. అలాంటి వారు టమాటాల వంటి ఆగ్జలేట్స్ కలిగిన ఆహారాలను మితంగా తీసుకోవటం మంచిది.

కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య ఉన్న‌వారు మాత్రం టామాటాతో చేసిన ఆహారాల‌కు దూరంగా ఉండటమే మేలు. స‌మ‌స్య వ‌చ్చి త‌గ్గిన వారు కూడా ఆయా ఆహారాల‌ను తిన‌డం త‌గ్గించాలి. లేదా వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. దీంతో కిడ్నీ స్టోన్లు మ‌ళ్లీ రాకుండా చూసుకోవ‌చ్చు. 100 గ్రాముల టమోటాలో 5 గ్రాముల ఆక్సలేట్ ఉంటుంది.

అధిక బ‌రువు ఉన్న‌వారు, డ‌యాబెటిస్‌, హైబీపీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు కూడా ఆగ్జ‌లేట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌కు దూరంగా ఉండాల‌ని వైద్యులు చెబుతున్నారు. వారిలో కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంటున్నారు. అలాంటి వాటిని మానే పరిస్ధితి లేకపోతే స్వల్పమోతాదులో తీసుకోవటం చేయాలి.

టమాటాలు రోజు ఆహారంలో బాగం చేసుకుంటున్నా కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డ‌ని వారు నిరభ్యంత‌రంగా టమాటాలను తినవచ్చు. కానీ కిడ్నీ స్టోన్లు ఒక‌సారి ఏర్ప‌డి తొల‌గిపోయినా, ప‌దే ప‌దే స్టోన్లు వ‌స్తున్నా టమాటాను తినకుండా ఉండటమే మేలు. టమాటాలే కాదు ఆగ్జలేట్స్ ఎక్కువగా ఉండే బీట్ రూట్, పాలకూర, సోయా, వంటి వాటిని తీసుకోవటం మంచిదికాదు.

అలాంటి వారు మాత్రం ఆగ్జ‌లేట్లు, కాల్షియం వంటి ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉండే ట‌మాటాలు, పాల‌కూర‌, న‌ట్స్‌, బీట్‌రూట్‌, చాకొలేట్‌, టీ, సోయా వంటి ఆహారాల‌ను తీసుకోరాద‌ని సూచిస్తున్నారు. వాటిని వీలైనంత వ‌ర‌కు త‌గ్గించి తీసుకోవ‌డ‌మో లేదా పూర్తిగా మానేయ‌డ‌మో చేయాల‌ని అంటున్నారు. లేదంటే స‌మ‌స్య ఇంకా తీవ్ర‌మ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.