హైదరాబాద్ లో శాటిలైట్ బస్ టెర్మినల్

హైదరాబాద్ లో శాటిలైట్ బస్ టెర్మినల్ కు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఎప్పుడు రద్దీగా ఉండే దిల్ సుక్ నగర్, ఎబీ నగర్ ప్రాంతాలకు వివిధ జిల్లాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ బస్ టెర్మినల్ సేవలు అందించనుంది. రూ. 18 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించనున్నట్లు ఈ పనులు హెచ్ఎండీఏ చేపట్టనుంది. హైదరాబాద్ లో రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతుండటతో సిటీకి నలువైపులా భారీ బస్ టెర్మినల్ నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మియాపూర్, ఎల్ బీ నగర ప్రాంతాల్లో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
నల్లగొండ, ఖమ్మం, గుంటూరు, విజయవాడ, విశాఖ నుంచి వచ్చే బస్సులకు ఎల్ బీ నగర్ ప్రాంతంలో శాటిలైట్ బస్ షెల్టర్ కు ప్రణాళికలు సిద్ధం చేసిన హెచ్ ఎమ్ డీఏ ఇక దాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు షురూ చేసింది. సాధారణంగా దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల మీదుగా సిటీకి పెద్ద సంఖ్యలో ప్రయాణికుల రాకపోకలు కొనసాగిస్తూ వుంటారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రతి రోజూ 600 నుంచి 700 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తుండగా వేలాదిగా ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు.
ఈ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా కావడంతో దిల్ సుఖ్ నగర్, ఎల్ బీ నగర్ ప్రధాన రోడ్డుతోపాటు ఇతర రోడ్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో వనస్థలీపురం వద్ద గల హరిని వనస్థలీ వద్ద 1.2 కిలో మీటర్ల పరిధిలో భారీ బస్ టెర్నినల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అందుకోసం అధికారులు అవసరమైన చర్యలు వేగంగా చేపడుతున్నారు.
మొత్తం ఆరు బస్సు బేలతో ఈ టెర్మినల్ నిర్మాణం కానుంది. ఈ శాటిలైట్ బస్ టెర్మినల్ లో అన్ని అత్యాధునిక హంగులు ఉండనున్నాయని అధికార వర్గాలు. సిటీలోని వివధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులకు కోసం ప్రత్యేకంగా ఒక బస్సు బే ఉండనుంది. ప్రయాణికుల కోసం ఏసీ, నాన్ ఏసీ గదులను ప్రత్యేకంగా నిర్మిస్తున్నాను. ప్రతి రోజు 16 వేల మంది రాకపోకలు సాగించేదుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టలని నిర్ణయించారు.
ఎకో ఫ్రెండ్లీగా ఉండేలా 490 కేవీ సౌర విద్యుత్ ఉత్పత్తి, మురుగు నీరు శుద్ధి కోసం ఎస్ టీపీ, బైక్ లకు, కు ప్రత్యేకంగా పార్కింగ్ తోపాటు ప్రాథమిక ఆరోగ్య చికిత్స కేంద్రం వంటివి కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.