School holidays : విద్యార్థులకు ఎగిరిగంతేసే న్యూస్.. స్కూళ్లకు ఆరు రోజులు సెలవులు.. ఏఏ తేదీల్లో.. ఎందుకంటే?

School holidays :తెలంగాణలోని విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త. పాఠశాలలకు వరుసగా సెలవులు రానున్నాయి. రెండుమూడు రోజులు కాదు.. ఏకంగా వారం ..

School holidays : విద్యార్థులకు ఎగిరిగంతేసే న్యూస్.. స్కూళ్లకు ఆరు రోజులు సెలవులు.. ఏఏ తేదీల్లో.. ఎందుకంటే?

School holidays

Updated On : December 10, 2025 / 12:36 PM IST

School holidays :తెలంగాణలోని విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త. పాఠశాలలకు వరుసగా సెలవులు రానున్నాయి. రెండుమూడు రోజులు కాదు.. ఏకంగా వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు రానున్నాయి.

Also Read: క్రాష్ లాండింగ్ అంటే మరీ ఇలానా.. హైవే మీద కారు.. ఆ కారు మీద లాండయిన విమానం.. వీడియో బీభత్సంగా వైరల్

పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని పాఠశాలలకు వరుస సెలవులు రానున్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులకు వరుసగా హాలిడేస్ రానున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్నారు. తొలి విడత పోలింగ్ సందర్భంగా డిసెంబర్ 10, 11 తేదీల్లో పాఠశాలలకు హాలిడేస్ ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇక రెండో విడత ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 13, 14 తేదీల్లో జరగనున్నాయి. ఈ రెండు రోజులు రెండో శనివారం, ఆదివారం కావడంతో రెండ్రోజులు కలిసి వచ్చాయి.

మూడో విడత పోలింగ్ సందర్భంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో పాఠశాలలకు హాలిడేస్ ప్రకటించారు. పోలింగ్ సామాగ్రిని సిద్ధం చేయడం, ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, కార్మికులకు నెలవారి వేతనంతో కూడి హాలిడే 11వ తేదీన ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇదిలాఉంటే.. డిసెంబర్ 25న క్రిస్మస్ పండగ, 26న బాక్సింగ్ డే, 28న ఆదివారం ఇలా.. ఈనెలలో స్కూళ్లకు వరుసగా సెలవులు రాబోతుండటంతో విద్యార్థులు ఖుషీ అవుతున్నారు.