Swati Lakra : టీఎస్ఎస్ పీ బెటాలియన్స్ అదనపు డీజీగా స్వాతి లక్రా

సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీగా నియామకం అయ్యారు. ఈ మేరకు ఆమె ఇవాళ బాధ్యతలు చేపట్టారు.

Swati Lakra : టీఎస్ఎస్ పీ బెటాలియన్స్ అదనపు డీజీగా స్వాతి లక్రా

swati lakra

Updated On : January 10, 2023 / 5:27 PM IST

Swati Lakra : సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా టీఎస్ఎస్ పీ బెటాలియన్స్ అదనపు డీజీగా నియామకం అయ్యారు. ఈ మేరకు ఆమె ఇవాళ బాధ్యతలు చేపట్టారు. గత నాలుగు సంవత్సరాల నుంచి స్వాతి లక్రా తెలంగాణ మహిళా భద్రతా విభాగం అదనపు డీజీగా విధులు నిర్వర్తించారు. టీఎస్ఎస్ పీ అదనపు డీజీగా స్వాతి లక్రా బదిలీ అయ్యారు.

స్వాతి లక్రాకు నిన్న మహిళా భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. స్వాతి లక్రాపై పూల వర్షం కురిపించారు. ఆమెపై తమకు ఉన్న అభిమానాన్ని వారు చాటుకున్నారు. కాగా, పోలీస్ మహిళా భద్రతా విభాగం చీఫ్ గా ఏడీజీ శిఖా గోయెల్ నిన్న బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.